విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయ సమస్యల సాధనే ధ్యేయంగా ఎస్టీయూ పనిచేస్తున్నదని ఎస్టీయూ రాష్ట్ర నాయకులు యువశ్రీ మురళి అన్నారు.
శుక్రవారం తొట్టంబేడు మండలంలోని ఎస్టీయూ ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సభ్యత్వ నమోదు – సమస్యల సేకరణ ప్రక్రియ చేశారు.
ఈ సందర్భంగా ఎస్టీయూ రాష్ట్ర నాయకులు రామకృష్ణయ్య మాట్లాడుతూ దీర్ఘకాలికంగా ఉన్న ఉద్యోగ,ఉపాధ్యాయుల ప్రధాన సమస్యలను పరిష్కరించాలని అన్నారు.
75 వసంతాల దశాబ్దాల చరిత్ర కలిగిన ఎస్టీయూ ఎన్నో ఉద్యమాల పోరాటాల ఫలితంగా సమస్యలను సాధించిన చరిత్ర ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు కృష్ణయ్య,చేమూరు రవి, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
.