Warning: Undefined array key "pt-cv-view-type" in /home/adarsini/public_html/wp-content/plugins/content-views-query-and-display-post-page/includes/block_view.php on line 112
పిఆర్సి రిపోర్టు అస్సలుబహిర్గతం చేయకుండా.. ఉద్యోగ ఉపాధ్యాయ పింఛనుదారులకు అన్యాయం జరిగేలా ప్రకటించిన వేతన సవరణ తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రాష్ట్రోపాధ్యాయ సంఘం(STU) చిత్తూరు జిల్లా కౌన్సిల్ తన నిరసనను వ్యక్తం చేసింది.
ఈ మేరకు వీకోట లో జరిగిన ఎస్ టి యు జిల్లా కౌన్సిల్ సమావేశాలలో ఏకగ్రీవంగా పలు తీర్మానాలను ఆమోదించారు
👉 ప్రస్తుతం ప్రకటించిన వేతన సవరణ విధానం అన్యాయం, అశాస్త్రీయం. దీనివలన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ప్రభుత్వం వేతన సవరణ గురించిన నిర్ణయాన్ని పునః సమీక్షించాలి
👉CPS విధానం రద్దు విషయంలో… దాటవేత ధోరణి విడనాడి వెంటనే సిపిఎస్ రద్దు చేయాలి
👉 ప్రస్తుతం అమలులో ఉన్న ఇంటి అద్దె భత్యం వీలైనంత పెంచాలి తప్ప ..తగ్గించేందుకు ప్రయత్నించడం అన్యాయం
👉 నూతన జాతీయ విద్యా విధానాన్ని అందులో నిబంధనలను తప్పనిసరిగా సవరించాలి.
👉 ఉన్నత పాఠశాలలో రెండు మాధ్యమాలు కొనసాగించాలి.స్కూల్ అసిస్టెంట్లకు కు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాలి
👉 పాఠశాలల్లో ఖాళీలు భర్తీ చేసేందుకు వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించాలి. నిరుద్యోగులకు న్యాయం చేయాలి
👉 మున్సిపల్ , ఎయిడెడ్, కేజీబివి, ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలి
👉 వివిధ రకాల యాప్ ల భారాన్ని తొలగించాలి. .ఉపాధ్యాయులను పూర్తిగా బోధన కే వినియోగించాలి
👉 వీటితో పాటు పలు తీర్మానాలను ఎస్ టి యు చిత్తూరు జిల్లా కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది
👉 ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఆందోళనా కార్యక్రమాలను తేదీలను ఖరారు చేయాలని నిర్ణయించింది
.