నిన్నటి రోజున బిజెపి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం జరిగింది. కానీ బిజెపి ప్రభుత్వానికి కార్పొరేట్ సంస్థల అన్నా, ధనిక వర్గాలు అన్నా చాలా ప్రీతి గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ బడ్జెట్లో ఎరువుల మీద ,ఆహారం మీద , ఉన్న సబ్సిడీ తగ్గించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే సంక్షేమానికి నీరుగార్చారు, ఆదాయం పన్నుల్లో మార్పు లేకపోవడం వల్ల మధ్యతరగతికి చెందిన ఉద్యోగులు అయితే నేమి అనేక మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్లు నిరాశకు గురయ్యారు అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్. ఎస్. బతైయ్య నాయుడు పేర్కొన్నారు.
కరోనా ఇంకా కొనసాగుతున్న తరుణంలో బిజెపి ప్రభుత్వం బడ్జెట్లో “ఆరోగ్య విభాగానికి 0.2 శాతం అలెర్ట్ చేయడం” చాలా దారుణం అని ఇదేవిధంగా 2020లో దేశంలో కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో కరోనా ప్యాకేజ్ “20 లక్షల కోట్లతో “శ్రామికులు ,వలస కూలీలు ,పేద ,బడుగు, బలహీన వర్గాలను ఆదుకుంటామని చెప్పి చిన్న పరిశ్రమలకు చేయూత ఇస్తామని చెప్పి కనీసం “2 లక్షల కోట్లు” కూడా ఖర్చు చేయలేదు, దీన్నిబట్టి బిజెపి ప్రభుత్వం మోడీ నాయకత్వంలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అని ఆయన విమర్శించారు.
“పోలవరం ప్రాజెక్ట్ ఊసేలేదు” ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ లో ,ఉన్న “కెన్ -బెత్వార్ ప్రాజెక్టుకు 44605 కోట్లు” కేటాయించడం జరిగింది.
అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు తాగునీరు, విద్యుత్ ,అవసరాలు తీర్చగలిగిన “బహుళ ప్రాజెక్టు” అయినా పోలవరానికి కేటాయింపులే లేవు,
దీన్నిబట్టి మోడీ ప్రభుత్వం ఎంత వివక్షతో ముందుకు పోతుందో తెలుసుకోవాలని ,ఈ బడ్జెట్ పసలేని బడ్జెట్ అని, ఇది పేద, బడుగు, బలహీన వర్గాలకు వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్. ఎస్. బతైయ్య నాయుడు తెలియజేస్తున్నారు.
.