స్వచ్ సర్వేక్షణ్ 2020-21 లో జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన మునిసిపల్ కార్పొరేషన్ల కమిషనర్ల ను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అభినందించారు.
ఈ నెల 20 వతేదీన స్వచ్ఛ భారత్ మిషన్ ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని పలు మునిసిపల్ కార్పొరేషన్లు అవార్డులు సాధించాయి.
అందులో తిరుపతి నగరపాలక సంస్థ జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులు సాధించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో అవార్డులు సాధించిన మునిసిపల్ కార్పొరేషన్ ల కమిషనర్ లను గురువారం వెలగపూడి లోని సెక్రటేరియట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పట్టణ, పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, సి.డి.ఎం.ఏ. నాయక్ లు అభినందించారు.
ఈ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులు రావడం సంతోషకరమన్నారు. అవార్డులు రావడంతో మాపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్ల ప్రోత్సహాంతో అధికారులు, సిబ్బంది కృషితో ఈ అవార్డులు సాధించ గలిగామన్నారు. మరింత కృషి చేసి ఉన్నత ర్యాంక్ సాధిస్తామన్నారు.
.

Discussion about this post