శ్రీకాళహస్తి పట్టణం లోని కొత్తపేటలోని “చిత్తూర్ హ్యాండీక్రాఫ్ట్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్” కార్యాలయ ఆవరణలో కొయ్య బొమ్మల అధునాతన డిజైన్ల వర్కుషాప్ను టీ సత్యమూర్తి ( Asst Director హస్తకళలు ) హస్తకలల సేవ విస్తరణ కేంద్రం తిరుపతి వారు ప్రారంభం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి గుమ్మడిపూడి దశరథాచారి గారు (మేనేజింగ్ డైరెక్టర్ చిత్తూరు హాండీక్రాఫ్ట్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ ), శ్రీకాళహస్తి వారి అధ్యక్షతన నిర్వహించటం జరిగినది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సోమా రై (డిజైనర్ కోల్ కత్త), యం.రజాలి బేగ్ (స్టేట్ అవార్డీ, కర్లపూడి), పి.రవి ఆచారి (స్టేట్ అవార్డీ , మాధవమాల), పి.తిరుమల బాబు (స్టేట్ అవార్డీ , మాస్టర్ క్రాఫ్ట్స్ మెన్ , శ్రీకాళహస్తి ), టీ.దొరస్వామి, టీ. శుక్లచారి , టీ. గుణశేఖర్, డైరెక్టర్లు జి.మునస్వామి ఆచారి, టీ.బుజ్జయ్య , కే.వీరయ్య (బోనుపల్లి), పి.ప్రసాద్, టి.చంద్రశేఖర్, ఈ.చిన్నయ్య సుమారు 30మంది కళాకారులు ఈ కార్యక్రమములో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం కొయ్య బొమ్మలలో అదునాతన డిజైన్ల కళాకారులకు అవగాహన కల్పించుటకు ఫిబ్రవరి 25 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేనేత జౌళి శాఖ (Ministry of Textiles , హస్తకాళల)వారి సౌజన్యముతో ఈ కార్యక్రమం 25రోజులు నిర్వహింపబడుతుంది.
ఈ కార్యక్రమాన్ని హస్త కళాకారులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా దశరథాచారి కోరారు.
.