రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుకు బుధవారం తెలుగు మహిళ తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షురాలు చక్రాల ఉష శ్రీకాళహస్తీశ్వరస్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
చంద్రబాబునాయుడు జన్మదినం పురస్కరించుకుని మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన్ను కలసి చక్రాల ఉష శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు.
అనంతరం ముక్కంటి శేషవస్త్రంతో సన్మానించి… ప్రసాదాలు అందజేశారు.
.