కేంద్ర హోం శాఖ సలహాదారు కూనల్ సత్యర్థి, ఆర్థిక శాఖ డైరెక్టర్ అభేష్ కుమార్, డైరెక్టర్ అఫ్ అగ్రికల్చర్ మనోహరన్, వాటర్ రిసోర్స్ సూపరిటెండెంట్ శ్రీనివాస్ బైరీ తదితర ప్రముఖులు శనివారం ఉదయం తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.
వరద ప్రభావిత జిల్లాలో నష్ట అంచనా వేసేందుకు వచ్చిన సెంట్రల్ టీం నిన్న తిరుపతిలో పర్యటించి నేటి ఉదయం తిరుమలకు చేరుకొని విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.
దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
.