Warning: Undefined array key "pt-cv-view-type" in /home/adarsini/public_html/wp-content/plugins/content-views-query-and-display-post-page/includes/block_view.php on line 112
తనకెంతో ఇష్టమైన నటనా రంగాన్ని విడిచిపెట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి సేవ చేయాలని సంకల్పించి తెలుగుదేశం పార్టీని స్ధాపించిన తొమ్మిది నెలల వ్యవధిలోనే అధికారాన్ని చేపట్టిన మహనీయుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాలను సాధించడంలో చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ, మైనారిటీ విభాగం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన షేక్ జిలానీ తెలిపారు.
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన షేక్ జిలానీ ని శ్రీకాళహస్తి పట్టణ సహకార బ్యాంకు మాజీ అధ్యక్షుడు డి.వి.నారాయణ ఆధ్వర్యంలో నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆత్మీయ సత్కారం చేశారు.
నిబద్ధతతో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జిలానీ మరెన్నో పదవులు అలంకరించాలని కోరుకుంటున్నామని శ్రీకాళహస్తి పురపాలక సంఘం మాజీ కౌన్సిలర్లు బీమాల మునికృష్ణ, డా. నివేదిత మోరె లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం చిత్తూరు జిల్లా కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు నెమళ్ళూరు బుజ్జి, శ్రీకాళహస్తి పట్టణ సహకార బ్యాంకు మాజీ డైరెక్టర్ ఖాదర్ బాషా, తెలుగుదేశం పార్టీ బిసి విభాగం నాయకులు శేఖర్, బీమాల భాస్కర్, చిల్లకూరు బాలసుబ్రహ్మణ్యం @ మణి, వంశీ, మైనారిటీ నాయకులు మొఘల్ అహ్మద్, నందమూరి అభిమాన సంఘ నాయకులు డా.ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.
.