ఎంజీఎం స్కూల్ ఆవరణంలో చిన్నపిల్లలు కిండర్ గార్డెన్ కిడ్స్ అనే కార్యక్రమంతో వేసవికాలంలో ఎండ తాకిడికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్కూల్ పిల్లలు మరియు పేరెంట్స్ కి అవగాహన కార్యక్రమం చిన్నపిల్లలు చేసి చూపించారు.
అంతేకాకుండా ఎండ తీవ్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మరియు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి ,ఎలాంటి పానీయాలు తీసుకోవాలి ఈ కార్యక్రమం ద్వారా చిన్న పిల్లలు చూపించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఎంజీఎం గ్రూప్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ చిన్నపిల్లలు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేసి చూపిస్తున్నందుకు ఎంజీఎం స్కూల్ హెడ్ మాస్టర్ మరియు స్టాఫ్ కి కంగ్రాట్స్ తెలియజేశారు.
ఇలాంటి కార్యక్రమాలు ద్వారా చిన్నపిల్లలో ఎంతో చైతన్యం వస్తుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంజీఎం స్కూల్ హెడ్మాస్టర్ మునిరత్నం నాయుడు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.