భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు.. బాలికల విద్యాప్రదాయినిగా పేరుగాంచిన సావిత్రీబాయి పూలే పట్ల చిన్నచూపు చూడటం తగదని బీసీ సంక్షేమ సంఘం నేత కోట చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటర విడుదల చేశారు.
సావిత్రీబాయి పూలే జయంతిని ప్రతి యేటా జనవరి 3వ తేదీన ‘జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం’గా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అయితే కొవిడ్ సాకు చూపి… వరుసగా రెండేళ్లు సావిత్రీ బాయి పూలే జయంతి వేడుకలు జరపక పోవడం బాధాకరమన్నారు.
ఈ సారైనా జనవరి 3న సావిత్రీబాయి పూలే జయంతిని జరపాలని ఆయన డిమాండు చేశారు. మనదేశంలో మొట్టమొదట బాలికల పాఠశాల ఏర్పాటు మహిళగా… అణగారిన వర్గాలకు విద్యా బోధన చేసిన మహనీయులుగా… సార్వజనీన ప్రాథమిక విద్య కోసం ఎనలేని కృషి చేసిన దంపతులుగా పేరుపొందిన సావిత్రీబాయి ఫూలే పేరుగాంచారని ఆయన తెలిపారు.
అలాంటి మహనీయురాలైన సావిత్రీబాయి ఫూలే చిత్రపటం అనేక పాఠశాలల్లో, విద్యాసంస్థలల్లో నేటికీ లేకపోవడం బాధాకరమన్నారు. ఇకనైనా అన్ని విద్యాసంస్థలల్లో సావిత్రీబాయి ఫూలే చిత్రపటం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించేలా తగు చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆయన సూచించారు. సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
.