‘గట్టిగ అనుకో.. అయితది’ అని సినిమాలు చాలా చాలా సింపుల్ గా సంకల్ప శుద్ధిని మనకు అలవాటు చేశాయి. ‘aim high’ లాంటి గొప్పవాళ్ల మాటలు కూడా మనకు సంకల్పబలాన్ని గట్టిగానే నూరిపోశాయి. కానీ కేవలం సంకల్పం సరిపోతుందా?
గట్టి సంకల్పం అనేది ఖచ్చితంగా అవసరం. కానీ మానవప్రయత్నం లేని సంకల్పం వృథా. అదే విషయాన్ని మనకు సుభాషితం కూడా చెబుతుంది.
ఉద్యమేన హి సిద్ధ్యన్తి కార్యాణి న మనోరథైః
న హి సుప్తస్య సింహస్య ప్రవిశన్తి ముఖే మృగాః
ఏ పని అయినా సరే.. దానిని పూర్తి చేయాలని ఎంత బలంగా అనుకున్నా సరే.. కేవలం అనుకోవడంతో పూర్తి కాదు. జింకను తినాలనే కోరిక బలంగా ఉన్నంత మాత్రాన.. నిద్రిస్తున్న సింహం నోట్లోకి తనంతగా అది వచ్చి ప్రవేశించదు కదా. .. అని శ్లోక భావం.
జింకను తినాలనే కోరిక సింహానికి బలంగానే ఉంటుంది. అయితే అది దొరకాలి కద! అందుకోసం ఉరకాలి.. వెంటాడాలి.. జింక లాఘవాన్ని అందుకోవాలి.
కార్యసాధనకు పడవలసిన కష్టం కూడా అంతకు తక్కువేమీ కాదు. కేవలం పనిని పూర్తి చేయాలనే సంకల్పం ఒక్కటీ సరిపోదు. దానిని అందుకోవడానికి అనుగుణమైన మార్గాలను అన్వేషించాలి. ఆ మార్గాలను అనుసరించాలి. ఆయా దారుల్లో వచ్చే కష్టనష్టాలను అన్నిటినీ భరించాలి. ఆ దారుల్లో వెళ్లడానికి సరిపడా శక్తి సామర్థ్యాలను సమకూర్చుకునేలా మనల్ని మనం అప్ గ్రేడ్ చేసుకోవాలి..
ఇవన్నీ చేసుకున్నప్పుడు.. అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. పని పూర్తవుతుంది. ఇదేమీ లేకపోతే.. ‘న మనోరథైః’ అన్నట్టుగా.. కేవలం మనసులో అనుకోవడం వలన.. ఎంత గట్టిగా అనుకున్నప్పటికీ అది పూర్తి కాదు.
మరి ‘గట్టిగ అనుకో.. అయితది’ అనే నానుడి, వాస్తవం కాకపోతే.. జనసామాన్యంలోకి ఎలా వచ్చింది. వాస్తవం కాని సత్యం ఏదీ కూడా నానుడిగా జనంలోకి వాడుకలోకి రాదు. ఇలాంటి నానుడులు అన్నీ.. అచ్చంగా.. వారి అనుభవాల్లోంచి పుట్టినవి.. కాబట్టి వాస్తవాలే అయి ఉంటాయి.
ఇవి కూడా చదవండి :
Movie Review : తప్పక చూడదగిన చిత్రం క్రిష్-వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’
జనంమెచ్చిన సీఎం.. ఆడు మగాడ్రా బుజ్జీ
నయీమ్ ఇట్లో పాములు తేళ్ల పెంపకం.. ఎందుకో తెలుసా?
గట్టిగా అనుకోవడం ద్వారా.. కార్య సాధనకు పైన చెప్పుకున్న శక్తుల సముపార్జన, మార్గాన్వేషణ లాంటి అన్నింటి వైపు మనసు మళ్లుతుంది. గట్టిగా అనుకోవడం ద్వారా మాత్రమే.. వాటిని మనం సిద్ధం చేసుకుంటాం.. అలా జరిగితేనే ‘గట్టిగా అనుకోవడం’లోని మర్మం అర్థమైనట్టు!
శుభోదయం
ఇవి కూడా చదవండి :
హవ్వ.. రాజగురువు చెప్పినట్టే టీటీడీ ఆడుతోందా?
సురేష్ పిళ్లె : ఒక మా ఎలక్షన్.. మీడియా ఓవరాక్షన్
రామ్ బాణం : జర్నలిస్టులకు నోబెల్ శాంతి బహుమతి.. జర్నలిజం ప్రపంచానికే స్ఫూర్తి
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
.

Discussion about this post