పుత్తూరు MPDO గారికి, పుత్తూరు మున్సిపాలిటీ కమిషనర్ లకు బీజేపీ నాయకులు వినతిపత్రం అందించారు. వర్షాల తర్వాత దుర్భరంగా మారిన ప్రాంతాల్లో ఇబ్బందులు తొలగించడానికి శ్రద్ధ పెట్టాలని వారు కోరారు. నగరి నియోజవర్గం భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు యం. నిషీధ రాజు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు బిజెపి పుత్తూరు మండలం అధ్యక్షుడు ఇ శ్రీధర్ తెలిపారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గాను నగరి నియోజకవర్గంలో ని పుత్తూరు అర్బన్ ప్రాంతంలో ని 27 వార్డ్స్ , పుత్తూరు మండలం పంచాయతీ గ్రామం లో పూర్తిగా దెబ్బతిన్నాయి. వరద నీరు కొన్ని ప్రాంతాల్లో నిలిచిపోవడం వలన దోమలు బాగా వ్యాప్తి చెందాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోగాల బారిన పడుతున్నారు. ఈ విషయంపై తక్షణమే స్పందించి దోమలు నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని, నిలిచిన వరద నీటిని తొలగించాలని కోరారు. పుత్తూరు అండర్ బ్రిడ్జి కింద చేరిన వరద నీరు వలన ఆ మార్గంలో ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ తరపున కోరుతూ అధికారులకు వినతి పత్రం అందించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో పుత్తూరు మండలం అధ్యక్షుడు ఇ శ్రీధర్, ప్రధాన కార్యదర్శి మునిస్వామి, యువ మోర్చా అధ్యక్షుడు పురుషోత్తం, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు భాను చంద్ర, యువ మోర్చా ఉపాద్యక్షుడు బాబ్జి, యువ మోర్చా ప్రధాన కార్యదర్శి హరీష్ సీనియర్ నాయకుడు శేఖర్, మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
.