తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 30 నుండి డిసెంబరు 8వ తేదీ వరకు ఏకాంతంగా జరుగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు నవంబరు 29వ తేదీ అంకురార్పణ జరుగనుంది.
ఈ సందర్భంగా ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్షకుంకుమార్చన నిర్వహిస్తారు. భక్తులు వర్చువల్ గా ఈ సేవలో పాల్గొనేందుకు టీటీడీ అవకాశం కల్పించింది. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల నడుమ పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపడతారు.
నవంబరు 30న ధ్వజారోహణం :
ఆలయంలో నవంబరు 30న ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్వజస్థంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.45 నుండి 10 గంటల నడుమ ధనుర్లగ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అమ్మవారు వాహనమండపంలో వివిధ వాహనలపై దర్శనమిస్తారు.
వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం రాత్రి
30-11-2021 ధ్వజారోహణం చిన్నశేషవాహనం
01-12-2021 పెద్దశేషవాహనం హంసవాహనం
02-12-2021 ముత్యపుపందిరి వాహనం సింహవాహనం
03-12-2021 కల్పవృక్ష వాహనం హనుమంతవాహనం
04-12-2021 పల్లకీ ఉత్సవం – వసంతోత్సవం, గజవాహనం
05-12-2021 సర్వభూపాల వాహనం – సాయంత్రం స్వర్ణరథం బదులు సర్వభూపాలవాహనం,
రాత్రి -గరుడవాహనం
06-12-2021 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
07-12-2021 రథోత్సవం బదులు సర్వభూపాల వాహనం – అశ్వ వాహనం
08-12-2021 పంచమితీర్థం(వాహనమండపంలో) – ధ్వజావరోహణం.
.

Discussion about this post