స్నేహానికి నిర్వచనం చెప్పడం అంతటి క్లిష్టమైన పని వేరొకటి ఉండదు. ఏదో ఒక సమయంలో ‘స్నేహం అంటే ఏమిటి?’ అనే ప్రశ్న ఎదురుపడని మనుషులు కూడా ఉండరు. ప్రతి వ్యక్తికీ ఏదో ఒక సందర్భంలో తప్పక ఎదురయ్యే ఈ ప్రశ్నకు సమాధానాలు మాత్రం అనేక రకాలుగా చిత్రాతిచిత్రంగా ఉంటాయి.
స్నేహం/ప్రేమ విషయంలో ఎవరి దృక్పథం వారిది. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులూ అచ్చంగా సరిపోలనట్లే.. స్నేహం/ప్రేమ గురించిన ఏ ఇద్దరి అభిప్రాయాలూ ఒక్క తీరుగా ఉండవు. మహా అయితే.. ఒకరి అభిప్రాయంతో మరొకరు చాలావరకు ఏకీభవించవచ్చు గానీ.. అంతకు మించి- అంతకు భిన్నమైన అభిప్రాయం వారికి ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది.
ఇదే స్నేహానికి ఉన్న గొప్పదనం. ప్రతి ఒక్కరూ కూడా దానికి అద్భుతంగా అనుభూతించగలరు. ప్రతిఒక్కరూ కూడా.. దాని లోతులను స్పృశించగలరు. దాని శిఖరాలను చేరగలరు. కానీ దానిని ఇదమిత్థంగా నిర్వచించి చెప్పడం మాత్రం ఏ ఒక్కరికీ సంపూర్ణంగా సాధ్యం కాని పని.
స్నేహానికి/ప్రేమకు ఎన్ని నిర్వచనాలు అయినా ఉండవచ్చు గానీ.. ఓ సంస్కృత సుభాషితం కూడా.. తనదైన శైలిలో.. దీనిని అభివర్ణించడానికి ప్రయత్నిస్తుంది.
దర్శనే స్పర్శనే వాపి శ్రవణే భాషణే అపి వా
యత్ర ద్రవత్ అంతరంగం స స్నేహ ఇతి కథ్యతే
చూడడం, తాకడం, వినడం, మాట్లాడడం లాంటి చర్యల ద్వారా.. ఎక్కడైతే మనసు ద్రవిస్తుందో అదే స్నేహంగా చెప్పబడుతోంది. అంటే ఎవరిని చూడడం, ఎవరిని తాకడం, ఎవరి మాటలు వినడం, ఎవరితో మాట్లాడడం అనేది నీ హృదయాన్ని తాకుతుందో అదే స్నేహం, ఆప్యాయత, ప్రేమ. వాళ్లే స్నేహితులు, ప్రేమికులు! అనేది శ్లోక భావం.
ఇతరత్రా నిర్వచనాలు ఎన్నయినా ఉండవచ్చు గానీ.. ఈ నిర్వచనంతో మాత్రం అందరూ ఏకీభవించాల్సిందే. ఈ సుభాషితం చెప్పే సత్యం ప్రతి ఒక్కరికీ స్వానుభవంలో ఉండేదే.
స్నేహితులు, ప్రేమికుల మధ్య ఆ భావన వ్యక్తం కావడానికి ప్రత్యేకమైన స్పందనలు వేరుగా అక్కర్లేదు. చూస్తేచాలు, తాకితే చాలు, వారి మాటలు వింటే చాలు, వారితో మాట్లాడుతూ ఉంటే చాలు.. మనసు ఉల్లాసంగా తయారవుతూ ఉంటుంది. అలాంటి అనుభూతిని ఇవ్వడం కేవలం స్నేహానికి, ప్రేమకు మాత్రమే సాధ్యం.
EXCLUSIVE ARTICLES
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
ఆదిమధ్యాంతాలు ఎరగకుండా.. దివ్యస్వరూపంలాగా ఉండగలిగిన ప్రేమకు, స్నేహానికి ఎవరి భాష్యం వారు చెప్పుకోవచ్చు. అయితే.. ఈ సుభాషితం చెప్పే మాటలను కూడా ఒప్పుకోవాల్సిందే.ః
శుభోదయం
ఇవి కూడా చదవండి :
‘రామ్’ బాణమ్ : సినిమా వాళ్లు పాలిటిక్స్ కు పనికొస్తారా?
సురేష్ పిళ్లె : ఒక మా ఎలక్షన్.. మీడియా ఓవరాక్షన్
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
.