మన చుట్టూనే మన ఆరోగ్యానికి అవసరమైన అన్ని రకాలైన మొక్కలు, ఆకులు, పండ్లు ఉన్నాయి. కానీ ఈ విషయం మనం గుర్తించలేం. దీంతో అనేకరకాలైన రోగాల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ అనవసరంగా మన డబ్బును, సమయాన్ని వ్యర్ధం చేసుకుంటుంటాం.
ఆరోగ్యదాయకాలైన వాటిని ఆహారంలో భాగంగా మార్చుకోవడం అనేది మనకు పురాతన కాలంనుంచి అలవాటే. వంటఇంట్లోకి చాలా దినుసులు అలాగే ప్రవేశించాయి. అయితే.. నిన్నటి తరం కషాయాలు కూడా.. నేటి తరం మోడర్న్ పేర్లతో మళ్లీ మన వాడుకలోకి వచ్చేస్తున్నాయి.
మనందరికీ చాలా సులభంగా దొరికేది జామపండు. నిజానికి పల్లెల్లో జామపండు దాదాపుగా అందరి ఇళ్లల్లోను ఉండే చెట్టు. ఈ చెట్టు ఇంట్లో ఉంటే మనం చాలావరకు రోగాలను జయించవచ్చట.
జామపండు విషయానికి వస్తే దీన్ని ఇప్పటికీ పేదవాడి ఆపిల్ అని చెబుతారు. అంటే ఆపిల్ పండులో ఉండే సుగుణాలన్నీ కూడా దీనిలో ఉన్నయి కాబట్టి. అంటే ఫైబర్, విటమిన్ సితోబాటు యాంటీ ఆక్సిడెంట్లు ఈ పండులో పుష్కలంగా ఉన్నాయి. రోజూ ఓ యాపిల్ తీసుకుంటే.. డాక్టరుతో అవసరమే ఉండదు అని చెబుతారు కదా.. జామపండు కూడా అలాంటి పాత్ర పోషిస్తుందన్నమాట. డాక్టరును దూరం చేసే.. పేదవాడి పండు జామ!
జామపండు మన రక్తంలో షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు… జామ ఆకులు కూడా దీనికి సహకరిస్తాయట. ఎలాగంటే జామ ఆకులను కషాయంలాగా చేసి తాగడం వల్ల మన రక్తపోటు అదుపులో ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
ఇప్పుడు జామ ఆకులతో టీ చేసుకుని తాగడం అనేది ఫ్యాషన్ గా వస్తోంది. అదే పాతకాలంలో అయితే దీన్నే కషాయం అని చెప్పుకునేవారు. జామ ఆకులను కడిగి ఉడికించి చేసుకునే టీ తాగడం వల్ల రెండు రకాలైన మధుమేహ వ్యాధులను కూడా అదుపులో ఉంచవచ్చట.
అలాగే మహిళలకు బహిస్టు సమయంలో వచ్చే కడుపునొప్పి వంటి సమస్యలను ఈ జామ ఆకుల టీ తగ్గిస్తుందట.
ఇవి కూడా చదవండి :
Movie Review : తప్పక చూడదగిన చిత్రం క్రిష్-వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’
జనంమెచ్చిన సీఎం.. ఆడు మగాడ్రా బుజ్జీ
నయీమ్ ఇట్లో పాములు తేళ్ల పెంపకం.. ఎందుకో తెలుసా?
మరో ముఖ్యమైన అంశమేంమంటే బరువు తగ్గాలి అనుకునేవారు జామ పండ్లను ఎక్కువగా తినడం వల్ల వారికి కడుపు నిండిన ఫీలింగ్ రావడంతో ఇతర ఆహారాన్ని తక్కువ మోతాదులో తీసుకుంటారు. ఫలితంగా బాగా బరువు తగ్గవచ్చు.
జామపండ్లు క్యాన్సర్ నిరోధకాలుగా కూడా పనిచేస్తాయని ఒక అధ్యయనంలో తేలింది. ఇలా చెప్పుకుంటూ పోతే జామండు వల్ల బోలెడు ప్రయోజనాలు కనిపిస్తాయి. ఇంకేం… చక్కగా రోజూ జామపండు తినేసి, జామ ఆకుల చాయ్ తాగేసి ఆరోగ్యంగా ఉందామా!
ఇవి కూడా చదవండి :
సురేష్ పిళ్లె : ఒక మా ఎలక్షన్.. మీడియా ఓవరాక్షన్
రామ్ బాణం : జర్నలిస్టులకు నోబెల్ శాంతి బహుమతి.. జర్నలిజం ప్రపంచానికే స్ఫూర్తి
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
.