మున్సిపాలిటీలో పనిచేయు మున్సిపల్ కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలిచ్చి ఈఎస్ఐ పీఎఫ్ డబ్బులు కట్టాలి అని ఏఐటీయూసీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, పట్టణ నాయకులు భాషా రూప్ కుమార్ డిమాండ్ చేశారు.
నగరి మున్సిపాలిటీ లో పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పెండింగ్లో లో ఉన్న జీతాలు ఇవ్వాలని ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సుమారు నాలుగు సంవత్సరాలు పీఎఫ్ డబ్బులు చెల్లించకుండా, ఈ ఎస్ ఐ డబ్బులు కూడా దాదాపు రెండు సంవత్సరాలు కట్టకుండా కార్మికులు ఇబ్బంది పెడుతున్నారు. అనేకసార్లు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.
హాఫ్ కాసు విలీనం తర్వాత కూడా జీతాలు చెల్లించడంలో జాప్యం జరుగుతున్నది. అధికారులు దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తూ, పని పైన ఉన్న కార్మికులను ఇబ్బంది పెట్టకుండా సచివాలయ కార్యదర్శులు పని చేయాలని అన్నారు.
కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
జీవో నెంబర్ 151 ప్రకారం డ్రైవర్లకు 15 వేలు జీతం ఇవ్వాలని ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కార్మికులకు హెల్త్ అలవెన్సు వర్తింపజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు భాష, రూప్ కుమార్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మురళీ కోశాధికారి శేఖర్ నాయకులు సుబ్రహ్మణ్యం మురుగమ్మ, యేసుదాసు రాము, భాస్కర్ జానకిరామన్, సంపూర్ణమ్మ పార్వతి ఎల్లమ్మ వెంకట్ అమ్మ కార్మికులు పాల్గొన్నారు.
.