డిసెంబరు మూడో తేదీ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నగరి మండల భవిత కేంద్రంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు వి ఎస్ నమశ్శివాయం మాట్లాడుతూ ప్రతినెలా మండలకేంద్రంలో వైద్యులు పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణి చేస్తే దివ్యాంగులకు సౌకర్యంగా ఉంటుందన్నారు.
భవిత కేంద్రాలు విద్యార్థులకు అందించే అన్ని సౌకర్యాలను దివ్యాంగులు ఉపయోగించుకోవాలన్నారు.
భవిత Phy therapy కిషోర్ కుమార్, IERT టీచర్ భవాని సేవలను కొనియాడారు.
కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి పి. ఎన్. శ్రీదేవి మాట్లాడుతూ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు 3వ తేదీన నిర్వహించబడుతుంది రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా వికలాంగులు ఎదుగుదలను ప్రోత్సహించేలా ఈ దినోత్సవం ప్రయత్నిస్తుంది అన్నారు.
వికలాంగుల సమస్యలను పరిష్కరించి వారికి ఆసరానిచ్చి, వారు గౌరవంగా జీవిస్తూ సాధారణ జనజీవనంలో భాగమై అన్ని హక్కులు పొందేలా చూడాలన్నారు
కార్యక్రమంలో భవిత పిల్లలకు యోగ టీచరు నాగ అమృత, ఆర్ట్ మరియు క్రాప్టింగ్ టీచరు వేలు లను సన్మానించారు., విద్యార్థుల తల్లితండ్రులకు భోజన వసతి కల్పించారు. ముఖ్య అతిధుల ద్వారా పాఠశాలలోని వికలాంగ విద్యార్థలకు పిల్లలకు ప్లేట్లు, టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిళ్లు ఇప్పించారు.
భవిత కేంద్రంలోని వివిధ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు కార్యక్రమంలో PSHM కే. కుప్ప రాజు, టీచర్లు, CRP లు MRC స్టాఫ్ పేరెంట్స్ పాల్గొన్నార
.