నగరి నియోజకవర్గ పరిధిలోని నిండ్ర మండలంలో తెలుగుదేశం నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం, అధికార పార్టీ అనుసరిస్తున్న వైఖరి పట్ల వారు నిరసన తెలిపారు.
చంద్రబాబునాయుడు ను అవమానించే విధంగా వైసీపీ నాయకులు సభలో ఆయన భార్య పేరును ప్రస్తావించి.. మాట్లాడిన సంగతి తెలిసిందే. అందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నిరసనలు చేపడుతోంది.
వాటిలో భాగంగానే.. నిండ్ర మండలంలో తెలుగుదేశం నాయకులు ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామకూడలి వద్ద.. తెలుగుదేశం జెండాలు చేతబూని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
కుటుంబసభ్యులను కూడా అవమానించేలా వ్యవహరిస్తే ఈ ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. నిండ్ర మండల తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.
Also read : ‘వ్యూ’ పాయింట్ : చంద్రబాబు ఏడుపు ప్లస్సా? మైనస్సా?
.