అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ 16 వ మహాసభలు జనవరి 7వ తేదీ నుండి10 తేది వరకు హైదరాబాద్ నగరంలో జరగనున్నాయని ఏ ఐ వై ఎఫ్ ఏరియ కార్యదర్శి తొండు. మల్లిఖార్జున్ పేర్కొన్నారు.
మహాసభలు వాల్ పోస్టర్ లను గురువారం ఉదయం శ్రీకాళహస్తి సిపిఐ కార్యాలయంలో పార్టి ఏరియ కార్యదర్శి జనమాల గురవయ్య ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న నరేంద్ర మోడీ కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమయ్యారని అన్నారు.
యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలు జగన్మోహన్ రెడ్డి అమలు చేయలేదన్నారు.
ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో పూర్తిస్థాయిలో ఉద్యోగాలు ప్రకటించలేదని, దానిని రద్దు చేసి నూతన క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
డిగ్రీలు పూర్తి చేసుకొని ఉద్యోగాలు లేక యువకులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకు పోతున్నారని చెప్పారు. నేడు యువకులు ఎదుర్కొంటున్న సమస్యలను, పాలక పక్షాలు తీసుకుంటున్న యువజన వ్యతిరేక విధానాలపై మహాసభల్లో సుదీర్ఘంగా చర్చిస్తామని తెలిపారు.
యువతకు న్యాయం జరిగేందుకు భవిష్యత్ పోరాట కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యువజన సమాఖ్య మండల కార్యదర్శి నాగరాజు. సురేష్. పార్టీ నాయికులు శివ. గోపి. శ్రీనువాసులు తదితరులు పాల్గొన్నారు.
.