శ్రీకాళహస్తి పట్టణం లోని 9వ వార్డు వాలంటరీగా పని చేస్తున్నటువంటి ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి కానిస్టేబుల్ వాళ్ళ తల్లి, అన్నా వదిన లపై సెక్షన్ 306 కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను తిరుపతి పార్లమెంట్ తెలుగుమహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష డిమాండ్ చేశారు.
గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్షణ కల్పించాల్సిన పోలీసు ఈ దుశ్చర్యకు పాల్పడితే మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. గతంలో ఇతనిపై అనేక కేసులు ఉన్నాయని గుర్తుచేశారు.
బుధవారంనాడు ఉమా మహేశ్వరి, తల్లిదండ్రులను లోభావి వద్దకు వాళ్ళను తీసుకొని పోయి బెదిరించారని, అంతేకాకుండా తండ్రి పైన కానిస్టేబుల్ చేసుకోవడంతో ఉమా మహేశ్వరి జీర్ణించుకోలేక నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని అన్నారు.
ఇప్పటికైనా పోలీసు జిల్లాస్థాయి అధికారులు ఈ కేసుపై పూర్తిస్థాయిలో సమగ్రవిచారణ జరిపి ఆ కానిస్టేబుల్ పైన వారికుటుంబం పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, వారినివెంటనే అరెస్టు చేయాలని, ప్రభుత్వం ఉమామహేశ్వరి కుటుంబాన్ని ఆదుకోవాలని చక్రాల ఉష డిమాండ్ చేశారు
ఈ వైసీపీ ప్రభుత్వం దిశ చట్టం అనే అబద్దపు బూచిని చూపిస్తూ మహిళలని మోసం చేస్తూ అమాయక ఆడబిడ్డలను పొట్టనపెట్టుకోవడం భాదగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు వేంటనే చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రేమ పేరిట వంచనకు బలైన వాలంటీరు ఉమామహేశ్వరి ఆత్మహత్య వార్త చదవండి :
.

Discussion about this post