వైసీపీ నాయకురాలు, నగరి శాసనసభ్యురాలు ఆర్ కే రోజా నోరు అదుపులో ఉంచుకోవాలని తిరుపతి పార్లమెంటు తెలుగుమహిళా విభాగం అధ్యక్షురాలు చక్రాల ఉష హెచ్చరించారు. ఈ మేరకు ఆమె బుధవారంఒక ప్రకటన విడుదల చేశారు.
మానవతా దృష్టితో రాజకీయాలకు అతీతంగా నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రజలు కష్టాలు గ్రహించి వరదల్లో నష్టపోయిన వారికి సహాయం అందించారన్నారు. తిరుపతిలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో భువనేశ్వరిని అసెంబ్లీ ఘటనపై మీడియా ప్రశ్నించినా… ఆమె ఎంతో హుందాగా సమాధానం చెప్పారని ఈ సందర్భంగా చక్రాల ఉష గుర్తు చేశారు. ఎవరినీ నిందించలేదన్నారు.
భువనేశ్వరి వ్యక్తిత్వానికి ఇది నిదర్శనమని ఉష పేర్కొన్నారు. అటువంటి వ్యక్తి మీద నగరి శాసనసభ్యురాలు ఆర్ కే రోజా జగన్ రెడ్డి మెప్పు కోసం.. మంత్రిపదవి కోసం తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటే తెలుగుమహిళలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
ఓట్లు వేసిన ప్రజల కష్టాల్లో ఉంటే జబర్దస్త్ లో వెకిలి నవ్వులు.. వెకిలి చేష్టలు చేస్తోందన్నారు. ఆఖరికి అసెంబ్లీలో కూడా వెకిలి చేష్టలకే సస్పెండ్ అయిన విషయం రోజా గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా ఉష గుర్తు చేశారు. ఇంతవరకు రోజా ప్రజలకు చేసిన మేలేoటో చెప్పాలని ఆమె నిలదీశారు.
నగరినియోజక వర్గానికి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు. గుమ్మడి కాయల దొంగ అంటే రోజా భుజాలు తడుముకుంటోందన్నారు. ఎక్కడ ఏమి జరిగినా రోజా నోరేసుకొని ముందు వరుసలో వచ్చి అధికారులను కూడా వదలకుండా తిడుతుందన్నారు.
టీడీపీ నేతలను, మహిళలను తప్పుడు కూతలు కూస్తూ ఉంటే చూస్తూ ఊరుకోరన్నారు.
నగరి నియోజవర్గ ప్రజలు కూడా అన్నీ గమనిస్తూనే ఉన్నారని.. అతి త్వరలోనే రోజా చెంపలు పగలగొడుతారన్నారు. రోజా ఇకనైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చక్రాల ఉష హితవు పలికారు.
.