శ్రీకాళ హస్తి మండలం కాపుగున్నేరి వద్ద గల కోకా కోలా మంగళ వారం జరిగిన గుర్తింపు ఎన్నికల్లో వై ఎస్ ఆర్ టీ యూ సీ కి చెందిన టీ-22 యూనియన్ తరపున గెలిచిన వాకా మురళి ని బుధ వారం ఉదయం పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు.
వై ఎస్ ఆర్ టీ యూ సీ రాష్ట్ర అధ్య క్షులు డా. పూనూరు గౌతమ్ రెడ్డి అదేశాల మేరకు వై ఎస్ ఆర్ టీ యూ సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. రాజా రెడ్డి కోకో కోలా కంపెనీ ప్రధాన ద్వారం వద్ద శాలువ కప్పి ఘనం గా సన్మానించారు.
ఈ సందర్బంగా ఎన్. రాజా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి జరిగిన ప్రతి ఎన్నికల్లో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనం గా విజయం సాధిస్తున్నదని అన్నారు.
కోకో కోలా కంపెనీలో గత నాలుగు పర్యా యాలుగా వై ఎస్ ఆర్ టీ యూ సీ సంఘం గెలుస్తూనే ఉన్నదని, దానికి అన్ని విధాలా సహకరిస్తున్న శ్రీకాళ హస్తి శాసన సభ్యులు బియ్యపు మధుసూదన రెడ్డి, యూనియన్ గౌరవ అధ్య క్షురాలు బియ్యపు పవిత్రారెడ్డి లకు, ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించిన కార్మికులకు వై ఎస్ ఆర్ టీ యూ సీ రాష్ట్ర కమిటి తరపున ధన్యవాదాలు తెలిపారు.
గెలిచిన వారు కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోకో కోలా ఉద్యోగుల యూనియన్ అధ్య క్ష్య, ప్రధాన కార్య దర్శులు మోహన్ గౌడ్, మురళి, ఉపాధ్య క్షులు సూరీబాబు, కోసాదికరి సుబ్బారా యుడు, పురుషోత్తం, శరత్, చందు, మురళి మోహన్, మధు రెడ్డి, ఫణి కుమార్ తదితరులు ఉన్నారు.
.