శ్రీకాళహస్తి పట్టణంలోని ద స్కూల్ కు చెందిన మెరిట్ విద్యార్థులకు గురువారం ట్రోపీలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్ఫాటు చేసిన సమావేశంలో ఎల్ ఐసీ శ్రీకాళహస్తి బ్రాంచ్ మేనేజరు రవిచంద్ర మాట్లడుతూ ప్రతి ఏడాది జీవిత బీమా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించడానికి మెరిట్ ప్రాతిపదికన ట్రోపీలు అందజేస్తున్నట్లు చెప్పారు.
ఇక ఉన్నత విద్య అభ్యసించే వారికి తమ సంస్థ తరపున ఉపకార వేతనాలు కూడా అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ద స్కూల్ విద్యార్థులు ఎంతో చక్కని ప్రతిభ కనబరుస్తున్నారని కొనియాడారు. 1నుంచి 10వ తరగతి వరకు తరగతుల వారీగా ప్రతిభ విద్యాపరంగా ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఈ ట్రోపీలు అందించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జనార్థనరావు జె.పవార్, ప్రధానోపాధ్యాయురాలు విశాల, రవినాయుడు, అసిస్టెంట్ మేనేజరు పాండురంగ మూర్తి, డెవలప్ మెంట్ ఆఫీసరు ఏవీ శేషారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
.