శ్రీకాహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉండే ముత్యాలమ్మ గుడివీధిలోని చక్రేశ్వరస్వామి వారి ఆలయంలో సోమవారం కార్తీక మాసం సందర్భంగా సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు.
శ్రీ చక్రేశ్వర స్వామి ఆలయం సోమవారం నాడు సహస్ర దీపాల అలంకరణలతో కాంతులీనంది.
భక్తుల శివనామ స్మరణతో ఆలయం మారుమోగింది.
గుంటూరుకు చెందిన గోపి అనే భక్తుడు దీపాలకు కావలసిన ప్రమిదలు, నెయ్యి అందజేశారు.
స్థానిక భక్తులు నూనె వితరణ గా అందజేయగా ఈ సహస్ర దీపాలంకరణ సేవ చాలా ఘనంగా జరిగింది.
ప్రముఖ చిత్రకారులు, రిటైర్డు టీచర్ పోలస్వామి స్వర్ణమూర్తి ఆధ్వర్యంలో దీపారాధన జరిగింది. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
.