అసలు రాష్ట్రంలో మహిళలకు భద్రత ఉందా? దిశ చట్టం ఏమైంది.? అంటూ శ్రీకాళహస్తి తెలుగుదేశం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్ముడు అర్ధరాత్రి ఆడబిడ్డలకు భద్రత కావాలని అంటే.. పట్టపగలే భద్రత లేకుండా పోయిందని అన్నారు.
శ్రీకాళహస్తిలో ఒకే రోజున మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి వెలుగుచూసిన రెండు సంఘటనల్లో తప్పు చేసిన వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు.
శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో గురువారం వాలంటీర్ ఉమా మహేశ్వరి అనే యువతి పోలీస్ కానిస్టేబుల్ ప్రసాద్ చేత మోసగించబడి ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ విషయం మరవక ముందే ఇదే పట్టణం లో నిన్న సాయంత్రం 7సంవత్సరాల చిన్నారిపై మల్లిఖార్జున్ అనే కామాంధుడు అత్యాచారానికి ప్రయత్నించగా.. తల్లి గమనించి కాపాడుకుంది.
తెలుగుదేశం నాయకులు వారి ఇంటికి వెళ్లి విచారించి వచ్చారు. ఆ తల్లితండ్రుల బాధ వర్ణానాతీతం అని పేర్కొన్నారు. ఇటువంటి తప్పులు పునరావృతo కాకుండా చర్యలు తీసుకోవాలని బాధితులకు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేశారు.
తిరుపతి పార్లమెంట్ తెలుగుమహిళ అధ్యక్షురాలు చక్రాల ఉష, మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ మిన్నల్ రవి, ఎస్సీ సెల్ అధ్యక్షులు గోపి,రాఘవులు, నెమళ్ళురు బుజ్జి, షాకీర్ ఆలీ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
.