శ్రీకాళహస్తీశ్వర స్వామి వారికి వెండితో చేసిన 350 గ్రాముల చెంబు, 205 గ్రాముల పాదుకలను,హైదరాబాద్ వాస్తవ్యులు అనంతలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులు కానుకగా అందజేశారు.
ఈ మేరకు సోమవారం వారు ఈ కానుకలను శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో పెద్దిరాజుకి అందజేశారు.
ఈ వెండి వస్తువులను స్వామి అమ్మవార్ల సేవల్లో ఉపయోగించుకోవాలని ఆమె, ఆలయ ఈవో పెద్దిరాజును కోరారు. ఆమె కోరిక మేరకు ఆమె అందజేసిన వెండి వస్తువులను స్వామి అమ్మవార్ల సేవలు ఉపయోగిస్తామని ఆలయ ఈవో పెద్దిరాజు ఆమెకు తెలియజేశారు.
అనంతరం ఆలయఈవో ఆదేశాలమేరకు అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులను స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
దేవస్థాన శాస్త్రానుసారంగా, గురుదక్షిణామూర్తివద్ద హారతులు ఇప్పించి ,వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య వారికి ఆశీర్వాదాలుఇప్పించిన ఆలయ అధికారులు స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందచేశారు.
.