చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా నిర్వహిస్తున్న స్కిట్ ఇంజినీరింగ్ కళాశాలను మూసివేస్తున్నట్లు కరస్పాండెంట్, ముక్కంటి ఆలయ కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు తెలిపారు.
ఈ మేరకు ఆయన బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.
కాలగర్భంలోకి స్కిట్ ఇంజినీరింగ్ కాలేజీ అనే శీర్షికతో ఆదర్శిని డాట్ కామ్ మూడు రోజుల కిందటే కాలేజీని మూసివేయబోతున్నట్లుగా సవివరమైన కథనాన్ని అందించింది. దానికి తగ్గట్టుగానే ఆలయ కార్యనిర్వహణాధికారినుంచి అధికారిక ప్రకటన బుధవారం వెలువడింది.
15ఏళ్ల పాటు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించిన స్కిట్ కళాశాల.. గత 8ఏళ్లుగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గి పోయిందని ఆయన పేర్కొన్నారు.
బీటెక్, ఎంటెక్, డిప్లొమా కోర్సుల్లో 1992 సీట్లు ఉంటే.. ప్రస్తుతం కేవలం 27మంది మాత్రమే విద్యార్థులు ఉన్నారన్నారు. కళాశాల ఉద్యోగుల వేతనాల కోసం ఆలయం తరపున ఇప్పటికే రూ.14కోట్లు చెల్లించామన్నారు.
భక్తుల నుంచి వచ్చే సొమ్మును ఆలయానికే ఖర్చు పెట్టాల్సి ఉందన్నారు. నిర్వహణ భారం మోయలేక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్కిట్ కళాశాల మూసి వేస్తున్నట్లు ఆయన తెలిపారు.
.