ఉమామహేశ్వరిని ప్రేమ పేరుతో వంచన చేసి ఆమె మరణానికి కారణమైనటువంటి ప్రసాద్ అనబడే కానిస్టేబుల్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని శ్రీకాళహస్తి భారతీయ జనతా పార్టీ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు కాసరం రమేష్ ఆధ్వర్యంలో రెండవ పట్టణ CI భాస్కర్ నాయక్ గారికి వినతి పత్రం ఇచ్చారు.
కాసరం రమేష్ మాట్లాడుతూ…, గత రెండు రోజుల క్రితం శ్రీకాళహస్తి పట్టణంలోని దక్షిణ కైలాసం నగర్ లో నివాసం ఉంటూ వాలంటీర్ గా సేవలందిస్తున్న ఉమా మహేశ్వరినిని ప్రేమ పేరుతో మోసం చేసినటువంటి ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలన్నారు.
బాధ్యతాయుతమైన ఇటువంటి పోలీస్ శాఖలో పని చేస్తున్నటువంటి ప్రసాద్ చేతిలో మోసపోయి అసువులు బాసినటువంటి ఉమామహేశ్వరీకీ తగిన న్యాయం చేయాలని, జవాబుదారీతనంతో అందరికీ ఆదర్శంగా విధులను నిర్వర్తించవలసిపోయి సభ్య సమాజం తలదించుకునే రీతిలో దిశ చట్టానికే కళంకం తెచ్చినటువంటి ఈ పోలీస్ శాఖలో పని చేస్తున్నటువంటి ప్రసాద్ ని శాఖాపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని అన్నారు.
ఉమామహేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేయడము జరిగింది.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ శ్రీకాళహస్తి పట్టణ ప్రధాన కార్యదర్శి వజ్రం కిషోర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చిలక రంగయ్య, పట్టణ ఉపాధ్యక్షులు చెంగల్రాయల్ రెడ్డి, L.గోపాల్,జిల్లా మహిళా మోర్చా నాయకురాలు ప్రజ్ఞశ్రీ, జిల్లా కార్యవర్గ సభ్యులు కొండేటి గోపాల్, వాసుయాదవ్, ఢిల్లీ కుమార్, కిరణ్ మనీ,నాని, సుబ్బు, తదితరులు పాల్గొన్నారు.
.