పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం అభినందనీయమని వైసీపీ నాయకురాలు బియ్యపు పవిత్రారెడ్డి అన్నారు.
తిరుపతిని జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో శ్రీకాళహస్తిలో శనివారం వైఎస్ ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా పవిత్ర మాట్లాడుతూ… చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా తిరుపతికి ఎంతో ఘన చరిత్ర ఉందన్నారు. ఇంతటి చరిత్ర కలిగిన తిరుపతిని జిల్లా కేంద్రంగా చేయడంతో అందరూ హర్షిస్తున్నారన్నారు.
బాలాజీ జిల్లా ఏర్పాటు చేయడం పట్ల స్థానిక ప్రజలు మొదలుకొని రాజకీయ పార్టీలు, మేధావులు, సామాజిక సంస్థలు సహా అన్ని వర్గాలు స్వాగతిస్తున్నారన్నారు.
తిరుపతి జిల్లా కేంద్రం కావడం వలన శ్రీకాళహస్తి ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ వైస్సార్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
.