చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ధృవీకరణ పత్రం అందించినట్లు రిటర్నింగ్ అధికారి రాజాబాబు ప్రకటించారు.
నామినేషన్ల కార్యక్రమంలో భరత్ మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో భరత్ ఎన్నిక లాంఛనం అయింది.
నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడం, భరత్ మినహా వేరే ఎవరూ నామినేషన్ దాఖలు చేయక పోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని అందించారు.
రిటర్నింగ్ అధికారి తో పాటు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎం ఎస్ మురళి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైసీపీలో ఆనందోత్సాహాలు
జిల్లా నుంచి ఎమ్మెల్సీ స్థానాన్ని ఏకగ్రీవంగా దక్కించుకోవడంపై వైసీపీలో ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ నాయకులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు.
.