• About Us
  • Contact Us
  • Our Team
Sunday, August 16, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

Good Morning : అలక్ష్యం చేసేముందు జాగ్రత్త!

admin by admin
October 3, 2021
0
Good Morning : అలక్ష్యం చేసేముందు జాగ్రత్త!

ఏదైనా సాధించడానికి మనం ప్రయత్నం చేస్తాం.. కఠినంగా అనిపిస్తుంది. వదిలేస్తాం. సులువుగా ఉండేదానిని ఎంచుకుంటాం. మంచి ఫలితమే వస్తుంది. మరి కఠినంగా అనిపించిన దానిని సాధించి ఉంటే ఇంకెలాంటి ఫలితం దక్కి ఉండేది? ఆ కఠినత్వాన్ని దాటే ప్రయత్నమే చేయలేదు గనుక.. ఆ సంగతి మనకు ఎప్పటికీ తెలియదు.

choose easy అనే మంత్రం మంచిదే. ఒక పని చేయడానికి పూనుకున్నప్పుడు సులువుగా ఉండే మార్గాన్నే ఎంచుకోవాలి. కఠినంగా ఉండే వాటి జోలికి వెళితే.. ఫలితం సాధించడం సంగతి తర్వాత, కాలయాపన మాత్రం తప్పదు! అంత మాత్రాన అన్నివేళలా ఈ మంత్రమే శరణ్యమా?

కఠినమైన దారిలోనే వెళ్లి తీరాలనడం ఉద్దేశం కాదు గానీ, కఠినంగా కనిపిస్తున్నది గనుక నిర్లక్ష్యం చేయడం, ఉపేక్షించడం తగనిపని.

విద్యార్థులు, పిల్లలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సూత్రం ఇది. మాథ్స్ కష్టంగా ఉందని చాలా మంది దాన్ని ఉపేక్షిస్తారు. ఇగ్నోర్ చేస్తారు. మాథ్స్ వదిలేసి మిగిలిన సబ్జెక్టులు చదువుకుంటే చాలనుకుంటారు. టెన్త్ తర్వాత.. ఇంటర్మీడియట్ వరకు వచ్చి.. తమకు తాముగా సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం రాగానే మాథ్స్ ను విడిచిపెట్టేవాళ్లు బోలెడంత మంది. కానీ.. మాథ్స్ ను వదలకుండా అభ్యసించిన వాళ్లు మాత్రమే ఇంజినీరింగ్ కోర్సుల్లోకి ప్రవేశించగలుగుతారు.

ఇక్కడేదో ఇంజినీరింగ్ మహాద్భుతమైన కోర్సు అని కాదు. కానీ.. కేవలం కష్టంగా కనిపించింది గనుక.. ఉపేక్షించొద్దు అని.

మాథ్స్ చదివేవాళ్లకు ఇలాంటి లెక్కే ఉంటుంది. అందులో ఒక నిర్దిష్టమైన టాపిక్ కష్టంగా అనిపిస్తే గనుక… దాన్ని ఇగ్నోర్ చేస్తారు. అది కష్టంగా ఉంది గనుక.. దాన్ని చదవకుండా వదిలేద్దాం.. ఛాయిస్ లో వదిలేద్దాం అనుకుంటారు. కానీ. నిజానికి ఆ కష్టాన్ని ఛేదించగలిగిన వాళ్లు అందులోని మజాను ఆస్వాదించ గలుగుతారు.

చదువులు, ఉద్యోగాలు, కెరీర్లో ఒడిదుడుకులు ఏమైనా సరే.. కఠినంగా కనిపించడం అనేది ఒక పొర మాత్రమే. అసలైన మజాను ఆస్వాదించకుండా దారి మళ్లించే తెర. ఒకసారి ఆ పొరను ఛేదించే టెక్నిక్ తెలిసిపోయిందంటే.. ఇక తిరుగుండదు.

ఈ విషయాన్నే మనకు అందంగా వివరించే ఓ శ్లోకం ఉంటుంది..

నారికేళ సమాకారా దృశ్యన్తేఽపి హి సజ్జనాః ।
అన్యే బదరికాకారా బహిరేవ మనోహరాః ॥

..హితోపదేశం – మిత్రలాభం లో నారాయణ పణ్డితుడు రాసిన శ్లోకం ఇది.

మంచివాళ్లు.. కొబ్బరికాయలాగా పైకి కఠినంగా కనిపిస్తారు. ఇతరులు రేగుపండులాగా పైకి మనోహరంగా కనిపిస్తుంటారు. అనేది ఈ శ్లోకభావం.

కొబ్బరికాయ మాత్రమే మంచిది. రేగుపండు మంచిది కాదు అనేది కాదు దీని అర్థం. అందంగా, సులువుగా తినగలిగేలా  కనిపిస్తుంది గానీ.. రేగుపండులో పురుగులు కూడా ఉండొచ్చు. ఒక్క రేగు పండు మాత్రమే ఏమిటి.. జామ, సపోటా, యాపిల్, అరటి.. ఏ పండు తీసుకున్నా.. చాలా సునాయాసంగానే తినేస్తాం మనం. కానీ కొబ్బరికాయ అలా కాదు. మన వల్లయ్యే పని కాదు. ముందు దాన్ని పగల గొట్టాలి. పగల గొట్టడానికి అంతకంటె కఠినమైనది.. ఓ రాయి కావాలి.

కానీ, అలా చేస్తే లోపల అమృతతుల్యమైన కొబ్బరినీళ్లు ఉంటాయి. ఆరోగ్య ప్రదాయకమైన రుచికరమైన కొబ్బరి ఉంటుంది. వాటిని దక్కించుకోవాలంటే.. చుట్టూ ఉండే కఠినత్వాన్ని బ్రేక్ చేసే విధానం తెలుసుకోవాలి.

ఈ సత్యాన్నే నారాయణ పండితుడు మనుషులకు అనువర్తించి చెబుతున్నారు. కఠినంగా కనిపించే వాళ్లు మాత్రమే మంచివాళ్లు అని దీని అర్థం కాదు. టెంకాయ కాదు కదా.. బండరాయి లాంటి మనుషులు కూడా ఉంటారు. ఎంత ముక్కలు ముక్కలుగా పగలగొట్టినా.. రాయే ఉంటుంది తప్ప లోపల ఇంకేం కనిపించదు. అలాగని పైకి అందంగా కనిపించే అందరూ చెడ్డవాళ్లని కూడా దీని అర్థం కాదు.

అయితే కఠినంగా కనిపించే పొరను ఛేదించి వెళ్లగలిగితే.. కొబ్బరి వంటి మంచితనపు రుచిచూపించే మనుషులూ ఉంటారు అనేదే భావం. కొత్త ప్రదేశాల్లో.. కొత్త సందర్భాల్లో ఈ సూత్రం ఎక్కువగా ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి :
movie review : కంటతడి పెట్టించే సినిమా ‘రిపబ్లిక్’
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం :   జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
రోజా సీటు కింద పెద్దిరెడ్డి కుంపటి రాజేస్తున్నారా
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
పవన్ కల్యాణ్ ఒంటరి అయిపోయాడా?
అవినీతి కేసుల్లో ఉన్న ఐఏఎస్ శ్రీలక్ష్మి .. తర్వాత ఎపీ సీఎస్ అవుతారా?

కొత్తగా కాలేజీలోనో, ఉద్యోగంలోనో చేరారనుకోండి. అక్కడ ఉన్న సహచరుల్లో కొందరు స్నేహశీలంగా కనిపిస్తారు. కొందరు కఠినంగా, రిజిడ్‌గా కనిపిస్తారు. స్నేహశీలంగా ఉండే వారితోనే మనం స్నేహం చేస్తాం. రిజిడ్ గా ఉండే వారిని పట్టించుకోం. కానీ.. ఆ కఠినంగా కనిపించే పొరను పగలగొట్టి.. వారితో స్నేహం చేయగలిగితే.. మన జీవితంలోని అనేక స్నేహాల్లో వారు ఒకరు మాత్రమే అవుతారు. కానీ వారి జీవితంలో మనం ఒక్కరమే గొప్ప స్నేహం అవుతాం. ఎంత మధురంగా ఉంటుంది అది. అమృతతుల్యమైన కొబ్బరినీళ్లలాగా!!

నారాయణ పండితుడు కేవలం మానవ సంబంధాలకు మాత్రమే దీనిని ముడిపెట్టారు గానీ.. నిత్య వ్యవహారంలో ప్రతి విషయాన్నీ ఈ నీతితో బేరీజు వేసుకోవచ్చు.

మనముందు పది పనులు ఉంటే.. కఠినంగా ఉండే పనిని ఇగ్నోర్ చేసి సులువుగా ఉండేవాటిని మాత్రం చేసుకుంటూ పోవడమూ కరెక్టు కాదు. మనముందు ఎంచుకోడానికి నాలుగు ఆప్షన్స్ ఉన్నప్పుడు.. కఠినంగా ఉన్నదాని జోలికి వెళ్లకుండా ఉపేక్షించడమూ  కరెక్టు కాదు. ఆ ‘కఠినం’ అనే పొర దాట గలిగితే.. అందులోనే మనకు ఎక్కువ ఉపయోగకరమైనది ప్రతిచోటా ఉంటుందేమో.

Tags: breaking the hardgood morningGood morning friendsGood Morning thoughtsgood wordshard targetsubhashithamsubhasitamtarget hardtry hardమంచి మాటశుభోదయంశుభోదయం సూక్తులుసుభాషితంహితవాక్యం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply