తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారనుందా అంటే అవుననే అంటున్నారు- సీనియర్ రాజకీయ నాయకులు. స్వరాష్ట్రం సిద్ధించిన నుండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోనే ఉంది. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత వచ్చిన ఎన్నికల్లో విజయం సాధించిన రోజున సీఎం కేసీఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామరావు మాట్లాడుతూ ‘తెరాస అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు.. ఇది తెలంగాణ రాజకీయ సమితి’ అని అభివర్ణించారు.
అంతవరకు బాగానే ఉంది. రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చారు. పక్క పార్టీలో గెలిచిన వారిని తీసుకొని మరీ మంత్రి పదవులు ఇచ్చారు. కానీ ఇప్పుడు పార్టీ పీఠాలు కదులుతున్నాయి. అందుకే స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. పార్టీ పీఠాలు కదలడం ఏంటి, అసలేం జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో.. అంటే ఈ కథనం చదవండి.
రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి, తన మాటల మంత్రంతో మంత్రముగ్ధులను చేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక్క సీఎం కేసీఆర్ మాత్రమే. తనకు నచ్చిన వారిని అందలమెక్కిచడం, నచ్చని వారిని పాతళంలోకి తొక్కేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పుకోవాలి.
తెరాస పుట్టుకలోనే ఉన్న ఆలే నరేంద్ర నుండి మొన్నటి రాములమ్మ (విజయశాంతి), నిన్న ఈటల రాజేందర్ ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా మందే ఉన్నారు. పొమ్మనలేక పొగబెట్టి బయటకి పంపినవారు, పార్టీ నుండి ఉన్నపళంగా సస్పెండ్ చేసిన వారు. ఇలా చెప్పుకుంటే వెళ్తుంటే చిట్టా బాగా పెద్దగనే ఉంది.
ALSO READ
చిరు చెల్లెలిగా ఆమె తప్ప మరో ఆప్షన్ లేదు
అమరావతి మహాపాదయాత్రలోకి జనసేనాని పవన్ కల్యాణ్
అయితే తెరాస నుండి బయటకు వెళ్లి భారతీయ జనతా పార్టీలో చేరి బలీయమైన శక్తులుగా ఎదుగుతున్నారు. వారు ఎదగడమే కాకుండా భాజపాను కూడా బలమైన పార్టీగా మార్చి తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇందుకు నిదర్శనం గతంలో జరిగిన సాధారణ ఎన్నికల దగ్గర నుండి దుబ్బాకలో రఘునందన్‌రావు విజయం తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తాచాటడం తర్వాత సీఎం రంగంలోకి దిగి పావులు కదిపిన ఈటల విజయం వరకు. ఇలా ఆ పార్టీ బలపడడానికీ అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి :
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
ఈటల విజయం తర్వాత భాజపా మరింత బలపడుతున్న విషయం పసిగట్టిన సీఎం. తనే స్వయంగా రంగంలోకి దిగారు. ఆ పార్టీని ఇప్పుడు ఢీ కొట్టకపోతే.. భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదని పసిగట్టారు. ఈటల గెలుపు తర్వాత, వరుసగా రెండు రోజులు ప్రెస్‌మీట్ పెట్టి మరీ తన అక్కసు వెళ్లగక్కాడు. అంతే కాకుండా కేంద్రంపై యుద్ధం చేస్తానంటూ రంగంలోకి దిగారు. రైతులను కేంద్రం మోసం చేస్తుందని ప్రజల్ని అయోమయంలోకి తీసుకువెళ్లేలా చేస్తున్నాడు.
తన రాజకీయ పబ్బం కోసం ఇప్పుడు రైతులను ముందుకు నెట్టాడు. ‘ఏ ఇతర రాష్ట్రంలోనూలేని విధంగా ధాన్యం కొనుగోలు ఇక్కడ మాత్రమే ఎందుకు సమస్యగా మారింది’ అనే సీక్రెట్ ను ప్రజలు పసిగట్టే వరకు సీఎం కేసీఆర్ ఆడే బాగోతం బయటపడదు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
యాసంగిలో వరి వేయద్దు అంటూ చెబుతున్నది రాష్ట్ర ప్రభుత్వామా లేక కేంద్ర ప్రభుత్వమా అనేది స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఆ విషయం పక్కనబెట్టి.. ధాన్యం కేంద్రం కొనడం లేదని వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. భాజపా పార్టీ తెలంగాణలో పాతుకుపోతుందన్న భయంతో తెలంగాణ వాదాన్ని తెరమీదకు తీసుకువచ్చారు సీఎం.
తెలంగాణలో వేరే పార్టీకి అధికారం ఇవ్వకూడదనే ఒక్క అక్కసుతోనే సీఎం రైతన్న జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. రాజకీయంగా ఇది ఆయన పార్టీకి వేరే గత్యంతరం లేని వ్యూహమే ఏమో గానీ.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు, ప్రజాప్రయోజనాలకు మాత్రం చేటు చేస్తుందని అందరూ గ్రహించాలి.
.. కె. శ్రీనివాస్,
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

.

Discussion about this post