ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గారి ఆకస్మిక మరణం సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని పథకాలలో తన ఆలోచనా విధానంతో ప్రజలకు మేలు చేశారన్నారు.
తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా సేవలందించిన కొణిజేటి రోశయ్య ఆకస్మిక మరణం చాలా బాధాకరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని ముక్కోటి దేవతలను ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ గ్రామీణ బ్యాంకు చైర్మన్ నాగేశ్వరరావు, చిరంజీవి రెడ్డి, మాజీ సర్పంచ్ నటరాజ మొదలియార్, మాజీ కౌన్సిలర్ ఢిల్లీ, దేశయ్య, దివాకర్, సుమన్, చందు, గుణ తదితరులు పాల్గొన్నారు.
.