గత ప్రభుత్వాలు పేదలకు మంజూరు చేసి నిర్మించుకున్న ఇళ్లకు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వన్ టైం సెటిల్ మెంట్ పేరుతో డబ్బులు వసూలు చేయడం ఏమిటని నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గాలి భాను ప్రకాష్ ప్రశ్నించారు..
లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించిన వైసీపీ ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి ఓటిఎస్ పేరుతో సొమ్ములు వసూలు చేస్తూ పేద ప్రజలను ఇబ్బంది పెడుతోంది అని ఆరోపించారు.
1983 నుండి 2011 వరకు అప్పటి ప్రభుత్వాలు కేటాయించి పేద ప్రజలు నిర్మించుకున్న పక్కా ఇళ్లకు సంబంధించి రు.10 వేల నుండి 20 వేల రూపాయలు చెల్లిస్తే రిజిస్ట్రేషన్ లు చేయిస్తామని చెప్పడం పేద ప్రజలను మభ్యపెట్టడమేనని ఆయన ఆరోపించారు.
వాలంటీర్ల ద్వారా పేద ప్రజలపై ఒత్తిడి తెచ్చి బెదిరింపులకు పాల్పడి భయపెడితే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
ఓ వైపు కరోనా తో ప్రజల ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది, మరోవైపు వరదల కారణంగా పేద ప్రజలు బ్రతక లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇలాంటి భారం మోపడం దారుణంమని, 20 ఏండ్లకు ముందు పక్కా ఇండ్లు నిర్మించుకుని లబ్ధిదారులు ప్రభుత్వం కు పన్నులు చెల్లిస్తూ కాపురం వుండే ఇండ్లకు ఇప్పుడు డబ్బులు ఎందుకు కట్టాలని ఆయన ప్రశ్నించారు.
ఇళ్ల రిజిస్ట్రేషన్ ల కోసం లబ్ధిదారులు ఎవ్వరూ ఓటిఎస్ క్రింద డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.. ప్రభుత్వం కు పేద ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి వున్నా ఓటిఎస్ తో సంబంధం లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ లు చేయించండి.. మీకు చేత కాకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఉచితంగా రిజిస్ట్రేషన్ లు చేయిస్తాం అని భాను ప్రకాష్ ప్రజలకు పిలుపు ఇచ్చారు.
.