దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన చిత్తూరు జిల్లా నగరి మండలం బుగ్గ దేవాలయం లో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి కి కంచి కామకోటి పీఠాధిపతుల విజయేంద్ర సరస్వతి ఆజ్ఞ తో వేద పండితులు ఆధ్వర్యంలో సోమవారం సహస్ర కలి శాలు అభిషేక మహోత్సవం నిర్వహించారు.
ఈ ప్రత్యేక కార్యక్రమాలు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు తరఫున చంద్రశేఖర్ ఘనాపాటి గారి ఆధ్వర్యంలో జరిగాయి.
కార్తీక మాసం సోమవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ ప్రత్యేక హోమం నిర్వహించి ఆలయంలోని కాశీ విశ్వేశ్వర స్వామికి అభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో కార్వేటినగరం లోని నాదస్వర పాఠశాల నుంచి వాయిద్య కళాకారులు పాల్గొన్నారు. వారికి కంచి కామకోటి పీఠాధిపతుల నుంచి వాయిద్యాలను ఈ సందర్భంగా ఉచితంగా అందించారు.
కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక కె పార్వతమ్మ ఆలయాధికారి గుణశేఖర్ నగరి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు.
.