సత్యవేడు శ్రీ సిటీ కి అధనం గా ఏడిని నియమించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ చలపతి ని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు.
శనివారం మధ్యాహ్నం తిరుపతి లోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆది మూలం ఎస్ఈ ని కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ సిటీ లో భారీ పరిశ్రమలు ఉండడం తో పాటు దిన దినాభివృద్ది చెందడం వల్ల ఏడి స్థాయి అధికారి పర్యవేక్షణ తప్పని సరి అన్నారు.
అలాగే పిచ్చాటూరు మండలం లోని ముడి యూరు పంచాయితీలో.. సత్యవేడు మండలం లోని సమర్థ కండ్రిగ లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటుకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
వీటిని కూడా త్వరితగతిన మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ఆయన ఎస్ఈ ని కోరారు.
అదే విధంగా ప్రస్తుతం శ్రీసిటీ పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది పనితీరు పై కూడా ప్రత్యేక పర్యవేక్షణ ఉండే విధంగా చూడాలని సూచించారు ఇందుకు ఎస్ఈ చలపతి సానుకూలంగా స్పందించారని ఆదిమూలం తెలిపారు.
.