ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం లోని కాసరం పంచాయతీ రాంభట్ల పల్లి గ్రామంలో వెలసివున్న అభయ ఆంజనేయ స్వామి ఆలయం నందు వైసిపి నాయకులు కలవగుంట భరత్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులకు దుప్పట్లు,పండ్లు పంపిణీ చేశారు.అనంతరం కేక్ కట్ చేసి గ్రామస్తులకు పంచి పెట్టి గ్రామస్తులతో సంబరాలు చేసుకున్నారు.
మాజీ సింగిల్ విండో అధ్యక్షులు కలవగుంట మహాదేవ రెడ్డి నవతరం ముఖ్యమంత్రి నవరత్నాల పథకాలతో ప్రజారంజకంగా ఇలాంటి ముఖ్యమంత్రి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని అన్నారు.
ఆయనే చిరకాల ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల ప్రజారంజక పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కన్నయ్య,మురళీ యాదవ్, సుధాకర్ నాయుడు, సుబ్రహ్మణ్యం, పవన్,బాబు,శ్రీను తదితరులు పాల్గొన్నారు.
.