ఈ రోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సబ్ జైలు ఖైదీలకు మంచి నీటి క్యాన్లు అందించారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని దివ్యాంగుల సేవా సంస్థ హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు మునీర్ భాషా ఆధ్వర్యంలో పట్టణంలోని సబ్ జైలు లోని ఖైదీల కొరకు మంచినీటి క్యాన్లను ఇవ్వడమైనది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా సబ్ జైల్ లో మంచినీటి ప్లాంట్ మరమ్మతులకు గురైన కారణంగా త్రాగునీటికి ఇబ్బంది పడుతుంది వారికి మినరల్ వాటర్ అందించాలని ఉద్దేశంతో వారికి ఈ వాటర్ క్యాన్లను ఇవ్వడమైనది అన్నారు.
గతంలో కూడా తమ సంస్థ ద్వారా క్యారమ్స్, పుస్తకాలను కూడా ఇచ్చి ఉన్నామని తెలిపారు. రాబోయే కాలంలో ఇంకా వారికి ఉపయోగపడే పనులు చేపడతామన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు మునీర్ బాషా తో పాటు న్యాయవాదులు జి రాజేశ్వర రావు, గరికపాటి రమేష్ బాబు, సభ్యులు ఢిల్లీ కుమార్, బాబా ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.
.