• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, July 22, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

Writer’s Blues 3 : ప్రేమలేఖలు

admin by admin
November 19, 2021
0
Writer’s Blues 3 : ప్రేమలేఖలు

జర్నలిస్టుగా, రచయితగా, ప్రచురణకర్తగా డాక్టర్ గోవిందరాజు చక్రధర్ ది సుదీర్ఘ ప్రస్థానం. రచయితగా, ప్రచురణకర్తగా ఆయనకు ఎదురైన స్వానుభవాలు ఈ Writer’s Blues. నలభైకి పైగా పుస్తకాలు తీసుకువచ్చిన వ్యక్తిగా.. ఆయన అనుభవాలను adarsini.com పాఠకులకోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఆ వ్యాసపరంపరలో ఇది మూడవది.

‘ప్రేమలేఖ’ ఈ పదమే యువతను ఊరిస్తుంది.. ఊహల్లో విహరింపజేస్తుంది. మరి హృదయంగమంగా ఎందరెందరో ప్రేమలేఖలను రాస్తే.. అందులో రసపుష్టి ఉన్నవి ఏరి, కూర్చి ఒక పుస్తకంగా ప్రచురిస్తే.. అది ‘ప్రేమలేఖలు’.. దాని ప్రచురణకర్తగా గోవిందరాజు చక్రధర్ అనుభవాలివి..

నేనప్పుడు రచన జర్నలిజం కాలేజి ప్రిన్సిపల్‌గా ఉన్నాను. 2005వ సంవత్సరం. ఆంధ్రజ్యోతి జర్నలిజం స్కూలు విద్యార్థులకు అనువాదంపై క్లాసు తీసుకోమంటే వారి ఆఫీసుకు వెళ్లాను. క్లాసు చెప్పడం పూర్తయ్యాక ఆదివారం ఆంధ్రజ్యోతి మేగజీన్ సెక్షన్‌కు వెళ్లా.

నల్లమోతు రఘురామయ్య ఆ సెక్షన్‌లోనే పనిచేస్తుంటారు. ఆయనను పలకరించాక తనే మేగజీన్ సెక్షన్ ఇన్‌ఛార్జి వేమన వసంతలక్ష్మి దగ్గరకు తీసుకెళ్లారు.

పిచ్చాపాటి మాట్లాడుతుండగా నాకో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే వసంతలక్ష్మిగారికి ఆ విషయం చెప్పాను.

స్థూలంగా ఆ విషయం ఇది –

ప్రతిఏటా ఫిబ్రవరి 14వ తేదీనాడు లవర్స్ డేను జరుపుకుంటారు. ఆ సందర్భంగా ప్రేమలేఖల పోటీని మీడియా హౌస్ పబ్లికేషన్స్, మీ మేగజీన్ సంయుక్తంగా నిర్వహిద్దాం. ప్రేమ లేఖల పోటీ ప్రకటన మేగజీన్‌లో ప్రచురించి గడువులోగా లేఖలను ఆహ్వానిద్దాం. ఉత్తమంగా ఉన్న మూడు ప్రేమలేఖలను మీరే ఎంపిక చేసి ఆ మూడు లేఖలను ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురించండి. ఆమూడు లేఖలకు నగదు బహుమతిని నా పబ్లికేషన్స్ తరఫున అందచేస్తా. బహుమతి గెలుచుకున్న మూడు లేఖలతోపాటు బాగున్నాయనిపించిన లేఖలను కూడా కలిపి మీడియా హౌస్ తరఫున పుస్తకంగా ప్రచురిస్తాను.

ఈ ప్రపోజల్ వసంతలక్ష్మి గారి ముందు ఉంచగానే వెంటనే అంగీకరించారు. ఓ మాట ఎడిటర్ గారికి కూడా చెప్పి అనుమతి తీసుకుంటాను అన్నారు.

ఆ తర్వాత చకచకా పనులు సాగాయి. ఎడిటర్ గారు ఒప్పుకున్నారు. పోటీ ప్రకటన మీరే రాసి పంపండి అన్నారు వసంతలక్ష్మి. లవర్స్ డే నాటికి ప్రేమలేఖల ప్రచురణకు వీలుగా పోటీ గడువు నిర్ణయించాం.

also read : గ్యాంగ్‌స్టర్ నయీమ్ రాజ్యం తయారు చేసిన రాక్షసుడా (ట్రైలర్ టాక్)

ఆ ప్రకటన కోసం నేను కష్టపడ్డాను. ప్రేమ గురించి ఇలా రాశాను అందులో..

‘‘పేరుకు రెండక్షరాలే కానీ ప్రేమ మహా చిలిపిది.

ప్రేమ మహా దొడ్డది. త్యాగానికి సైతం అది వెనకాడదు.

ప్రేమ హృదయాల్లో తిష్టవేసి ఊసులాడుతుంది. దానికి కాలంతో పనిలేదు. ప్రపంచంతో పనిలేదు’’

ఇలా ప్రేమ గురించి మొదలుపెట్టి, ప్రేమ లేఖల పోటీ నిబంధనలను, మొత్తం స్కీమును వివరిస్తూ ప్రకటన సిద్ధం చేసి పంపితే మేగజీన్ లో ప్రచురించారు.

గడువు ముగిశాక వసంతలక్ష్మిగారికి ఫోను చేసి రెస్సాన్స్ ఎలా ఉంది? అనడిగాను.

‘మీ సెక్షన్ లో పనిచేసే రఘురామయ్యకు ప్రేమలేఖల కవర్లు ఇచ్చి పంపండి’ అని అన్నాను.

‘లేఖలు చాలా ఉన్నాయి. బహుశా టూవీలర్ మీద తీసుకెళ్లడం కష్టం. ఎవరినైనా పంపండి, ఆటోలో తీసుకెళ్తారు’ అన్నారు వసంతలక్ష్మి.

అలాగేనన్నాను. ‘ప్రేమలేఖల్లో బాగున్నాయనిపించిన వాటిని ఒక ముప్పై ఎంపిక చేసి పంపండి. వాటిలోనుంచి బహుమతికి అర్హమైన మూడు లేఖలను ఎంపిక చేయడం మాకు సులువు అవుతుంది’ అని వసంతలక్ష్మి చెప్పారు.

ప్రత్యేకంగా కుర్రాణ్ణి పంపి లేఖలను తెప్పించాను. రెండు అట్టపెట్టెల్లో వాటిని మా పబ్లిషింగ్ ఆఫీసుకు చేరవేశాడు. గుమ్మరిస్తే పెద్ద గుట్టగా తయారైంది. సుమారు 1500 దాకా ప్రేమలేఖలు వచ్చాయి.

హృదయాకారంలో పోస్టల్ కవర్ ను తయారుచేసి అందులో ప్రేమలేఖ పెట్టి పంపాడో ప్రేమికుడు.

ఏడవ తరగతి చదివే కుర్రాడు ఆరవ తరగతిలోని గర్ల్ ఫ్రెండ్ ను ఉద్దేశించి ప్రేమలేఖ రాశాడు. తన పాస్ పోర్టు సైజు ఫోటో వెనక గర్ల్ ఫ్రెండ్ ఫోటోనూ అతికించి పంపాడు.

also read : ప్రధాని నరేంద్రమోడీ.. మొండిపట్టు పట్టకుండా ఓటమి ఒప్పుకున్నాడు

ఎన్నెన్నో ప్రేమదారులు

దేవుడిని ఉద్దేశించి ప్రేమను ప్రకటించిన వారూ, చనిపోయిన భర్తను తలచుకున్నవారూ, అనుభూతితో పరవశించిన వారూ, ఆంతర్యాన్ని విప్పి చెప్పినవారూ, పూర్తిగా కవిత్వాన్నే చిలికించిన వారూ, ప్రేమకు సరికొత్త భాష్యాలు చెప్పినవారూ.. ఇలా బహువిధ రూపాల్లో ప్రేమలేఖలు రాసి పోటీని విజయవంతం చేశారు. అయితే ఎవరూ శృతిమించకపోవడం ఆనందం కలిగించింది.

వసంతలక్ష్మి గారు సూచించినట్లే అన్ని లేఖలను జల్లెడపట్టి 30 ప్రేమలేఖలను ఎంపిక చేసి ఆంధ్రజ్యోతి వారికి పంపాను.

ఆ 30 లేఖలనుంచి మూడు లేఖలను ఎంపిక చేసి వరసగా మూడు సంచికల్లో వాటిని ప్రచురించారు వసంతలక్ష్మి. ముందే అనుకున్నట్లుగా ఆ ముగ్గురు విజేతలకు బహుమతి మొత్తాలను నేను పంపాను.

also read : క్షమాపణ కోరిన మోడీ.. ప్రసంగం పూర్తిపాఠం

ఓ సమస్య ఎదురైంది..

ఈ క్రమంలో నేను ఒక సున్నిత సమస్యను ఎదుర్కొన్నాను. నాకు తెలిసినవారు కూడా తామూ ప్రేమలేఖల పోటీలో పాల్గొంటున్నామని చెప్పారు. నేను నిర్వహిస్తున్న పోటీలో నా స్నేహితులు పాల్గొనడం నైతికంగా ఎంతవరకు సమర్థనీయం అనే సందేహం ఎదురైంది. అయితే బహుమతి లేఖలను నేను ఎంపిక చేయటం లేదు. వసంతలక్ష్మి ఆ బాధ్యత చూస్తున్నారు. కనుక రాగద్వేషాల ప్రసక్తి ఉండదని మనసును సంబాళించుకున్నాను.

ముందే అనుకున్నట్లు, బహుమతికి ఎంపికైన లేఖలతోపాటు మిగిలిన వాటిలో బాగున్నవాటిని ఎంచి మీడియాహౌస్ తరపున పుస్తకం తేవాలి.

ప్రేమలేఖలను నేను ఎంపిక చేయటం కంటే మరింకెవరినైనా ఆ బాధ్యత అప్పగిస్తే బాగుంటుందనుకున్నాను. నాకు ఆత్మీయులైన డాక్టర్ కాకాని చక్రపాణిని, గుంటూరుకు చెందిన వైద్యులు, ఆత్మీయులు డాక్టర్ శిరిపురపు మధుసూదనరావును లేఖలను ఎంపిక చేసి పెట్టాలని కోరగా వెంటనే అంగీకరించారు. వారి సంకలనం, సంపాదకత్వాన మొత్తం 77 ప్రేమలేఖలను 160 పేజీల్లో వెలువరించాను.

also read : అమరావతి పాదయాత్రలోకి పవన్ కల్యాణ్

మొదటి బహుమతి లేఖ

రాజమండ్రికి చెందిన బులుసు వి.ఎస్.ఎస్.ఎన్.మూర్తి రాసిన ‘రేయ్ బంగారు కొండా!’ అనే ప్రేమలేఖ మొదటి బహుమతికి ఎంపికైంది. సోనూదీప్ రాసిన ‘వేయి వీణల నాదం’ రెండవ బహుమతి, కండ్లకుంట శరత్ చంద్ర రాసిన ‘నీ తలపులలో’ మూడవ బహుమతి గెలుచుకున్నాయి.

మోహన్ కవర్ డిజైన్

ప్రసిద్ధ చిత్రకారుడు మోహన్ చక్కగా కవర్ డిజైన్ చేశారు. ప్రేమలేఖలను ఇచ్చిపుచ్చుకోవటానికి తెలిసిన పిల్లలకు పనిపెడుతుంటారు ప్రేయసీ ప్రియులు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెనక అట్టమీద ప్రేమలేఖను చేరవేస్తున్న బాల మన్మధుడిని గీశాడు మోహన్.

ప్రేమలేఖ గురించి గుడిపాటి వెంకటాచలం చెక్కిన మాటలను కూడా వెనక కవర్ పై ప్రచురించాను.

also read : అచ్చే తరహ్ లడే హై .. అభినందించిన అమిత్ షా

అట్టర్ ఫ్లాప్ వెంచర్

ఈ జగత్తంతా ప్రేమమయం. ప్రేమలో మునిగితేలడం ఈ కాలపు యూత్ జీవ లక్షణం. ఆంధ్రజ్యోతితో కలిసి పోటీ నిర్వహించాను కనుక ప్రచారమూ బాగానే జరిగింది. ప్రేమలేఖలు పుస్తకం మార్కెట్‌లోకి విడుదల కాగానే సూపర్ డూపర్ హిట్ అవుతుందనుకున్నాను. త్వరగానే రీ ప్రింట్ చేయాల్సి రావచ్చుననీ ఆశించాను. అయితే నా అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. చేసిన కృషి, శ్రమ అంతా వృథా అయింది. ఒక్క కాపీ కూడా అమ్ముడు పోలేదు.

‘పుస్తకం అమ్మితే న్యూస్ గానీ అమ్మకపోతే న్యూస్ కాదన్న’ సత్యాన్ని ముందే గుర్తించిన వాణ్ని గనుక ఈ వైఫల్యాన్ని తట్టుకోగలిగాను. ప్రేమలేఖలు పుస్తకం అమ్ముడు పోనందుకు గుండెలను  గాయపరచుకోలేదు.

అంచనా ఎందుకు తప్పింది?

చలం రాసిన ప్రేమలేఖలను ఆదరించిన తెలుగు పాఠకులు, ఇంతమంది, విభిన్న వయసులవారు వైవిధ్యభరితంగా రాసి కురిపించిన గాఢ ప్రేమను ఎందుకు తిరస్కరించారు? అని బుర్రకు పనిపెట్టాను.

చలం ప్రసిద్ధ సాహితీవేత్త. చలం ప్రేమలేఖలకు ఒక తరం పాఠకుల్లో సాహిత్య గౌరవమూ ఉంది. అలాంటి బ్రాండ్ ఇమేజి నేను సంకలనం చేసిన ప్రేమలేఖలకు లేదు. పైగా ఏ కుర్రకారూ ధైర్యంగా ఈ పుస్తకాన్ని పుచ్చుకు తిరగడానికి  సాహసించకపోవచ్చు. ప్రేమలేఖలు పుస్తకం కొని ఒక కాలేజీ అమ్మాయి ధైర్యంగా ఇంటికి వెళ్లగలదా? ఆ పుస్తకం చేతిలో చూడగానే అమ్మాయి ప్రేమలో పడిందేమోనన్న అనుమానపు చూపులు సారిస్తారు పేరెంట్స్. ఈ కారణంగా యూత్ కొనలేదు. పైగా స్మార్ట్ ఫోన్లలోకంలో ప్రేమలేఖలు చదివి, ప్రేమలేఖలు తీరుబడిగా రాసేవారెందరుంటారు? ఇక మధ్యవయస్కులు, రిటైరయిన వారికీ ఎక్కే సబ్జెక్టు కాదనిపించింది.

EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి

కొసమెరుపు..

ఈ పుస్తకం ప్రచురించి కొంత కాలానికి రాజమండ్రి వెళ్లాను. అక్కడ జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహించాను. ఆ సందర్భంగా ఒక జర్నలిస్టు మిత్రుడు నా దగ్గరకొచ్చి మాటకలిపాడు.

‘మీరు ప్రేమలేఖలు పుస్తకం ప్రచురించారు గదా!’ అని అడిగాడు. అవునని తల ఆడించాను.

‘మొదటి బహుమతి లేఖ మీకు గుర్తుందా?’ అనడిగాడు.

‘ఎందుకు గుర్తులేదు, పుట్టింటికి పురుడు పోసుకోవటానికి వెళ్లిన భార్య తలపుల్లో, విరహాన్ని ప్రకటిస్తూ రాసిన లేఖ అది’ అన్నాను.

‘ఆ లెటర్ రాసింది నేనే. నా పేరుతో, బావుండదని తెలిసిన వారి పేరు మీద పంపాను’ ఆత్మీయంగా ఆనందంగా చెప్పాడాయన.

ప్రేమలేఖలు రాయటానికీ ఘోస్ట్ రైటర్స్ ఉంటారని తెలిసి కనువిప్పు కలిగింది.

– డాక్టర్ గోవిందరాజు చక్రధర్

శెభాష్ మోడీ! ఓడిపోవడమే- మీ విజయం!

ప్రధాని మోడీ క్షమాపణ : ప్రసంగం పూర్తి పాఠం

పాపం విష్ణు.. పరువు పోకుండా ఎన్ని పాట్లో..

ట్రైలర్ రివ్యూ : నయీమ్- ‘రాజ్యం’ తయారుచేసిన రాక్షసుడా?

Tags: artist mohanchakradhargovindaraju chakradharjournalist govindaraju chakradharlove letters in teluguprema lekhaluwriter's bluesఆర్టిస్ట్ మోహన్గోవిందరాజు చక్రధర్ప్రేమలేఖలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply