ఏదైనా సాధించాలంటే.. మనలోని బలాలు, మన శక్తి సామర్థ్యాల గురించి మనకు సంపూర్ణమైన అవగాహన ఉండాలి. అదే సమయంలో సాధించే సంగతి తర్వాత.. ఆ ప్రయత్నంలో అభాసు పాలుకాకుండా ఉండాలంటే.. మనలోని బలహీనతల, దుర్బలత్వం గురించి అంతకంటె ఎక్కువ అవగాహన ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే.. ‘బలం అంటేనే.. మన బలహీనతలు ఏమిటో గుర్తించి, వాటిపట్ల స్పష్టతతో ఉండడం’.
ఎవరి బలం ఏమిటి గుర్తించడం, ఆ ప్రకారం వాటిని సద్వినియోగంలో పెట్టడం సహజంగా నాయకత్వ లక్షణం అవుతుంది. ఈ సూత్రం మనందరికీ తెలిసిందే. ఒక టీమ్ లో నలుగురు ఉంటే.. ఎవరు ఏ పని బాగా చేయగలరో.. వారితో ఆ పని చేయించేవాడే మంచి కెప్టెన్ అవుతాడు. వ్యక్తులుగా కూడా అంతే. మనలోని మనల్ని ఓ మంచి కెప్టెన్ గా నిరూపించుకోవడం కూడా ఇలాగే. మనలోని బలాల్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారానే.
ఒక వ్యక్తికి బొమ్మలు బాగా గీయడం బలం అనుకుందాం. పాటలు పాడడం అనేది అతని ఆసక్తి. అంత గొప్పగా రాదు. ఆసక్తి గనుక.. బాగారాకపోయినా పాటలు పాడే కెరీర్ ఎంచుకుంటే ఇబ్బంది పడతాడు. తనలోని బలాన్ని గుర్తించి, వాడుకుంటే రాణిస్తాడు.
అలాగే బలహీనతను గుర్తించినప్పుడు దాన్ని దాచుకోవడం కూడా కరెక్టు కాదు. అదే వ్యక్తి పాట పాడడం అతనికి తప్పనిసరి విధిగా మారింది అనుకోండి. బలహీనతను (చేతకాకపోవడాన్ని) దాచుకుని పాడడం ప్రారంభిస్తే అభాసు పాలవుతాడు. యిక్కడ, బలహీనతను దాచుకోకపోవడం అంటే.. ఇతరుల సాయం తీసుకోవడానికి మొహమాటపడకపోవడం. మన దుర్బలత్వాన్ని దాచుకోకుండా ఉన్నప్పుడే.. ఎవరైనా మనకు సాయం అందిస్తారు. మనం గండం నుంచి బయటపడతాం.
హఠాత్తుగా ఆర్థిక అవసరం ఏర్పడుతుంది. ఆప్తుల్ని సాయం అడుగుతాం. మన దగ్గర లేదనే సంగతి బయటపెట్టుకోకపోతే, అవతలి నుంచి సాయం అందడం కూడా జరగదు.
ఎవరెవరికి ఏది బలం అని చెప్పే ఓ సుభాషితం కూడా ఉంటుంది.
దుర్బలస్య బలం రాజా బాలానాం రోదనం బలం
బలం మూర్ఖస్య మౌనిత్వం చోరాణాం అనృతం బలం
దుర్బలుడికి, బలహీనుడికి పేదలకు బలం రాజే. అంటే వారి సంక్షేమం మొత్తం రాజు చూసుకుంటాడు. పసిపిల్లలకు ఏడుపే బలం. వాళ్లు కష్టం వచ్చినప్పుడు, ఆకలి వేసినప్పుడు ఏడిస్తేనే పెద్దవాళ్లు వచ్చి వాళ్లకు అవసరమైనదేదో చూస్తారు. మూర్ఖుడికి మౌనంగా ఉండడం బలం. మనకు విషయపరిజ్ఞానం లేనిచోట మౌనంగా ఉండడాన్ని మించిన మంచిమార్గం మరొకటి ఉండదు. దొంగకు అబద్ధమే బలం. దొంగవాడెప్పుడూ అబద్ధం చెప్పడం ద్వారా మాత్రమే తప్పించుకుంటాడు.
ఇవి కూడా చదవండి :
పవర్ స్టార్ పవన్ = గ్యాంగ్స్టర్ నయీమ్.. ఎలాగో తెలుసా?
అభిమానులు ఊహించని స్టెప్ వేసిన జనసేనాని
మొదటి వాక్యం.. ప్రభుత్వాలు చేపట్టే విచ్చలవిడి సంక్షేమ కార్యక్రమాలకు నిర్వచనంలా కనిపిస్తుంది. పేదలకు రాజే బలం కాబట్టి.. వారి బాగోగులు చూడాలనేది ఇందులోని నీతి.
బాలానాం రోదనం బలం- అనే వాక్యాన్ని మనం అనేక సందర్భాల్లో వాడుతుంటాం. ‘పసిపిల్లలు ఎంతగా ఏడుస్తూ ఉంటే అంత ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క’ అంటూ ఈ సుభాషిత వాక్యానికి మనం భాష్యం చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి అర్థం అది కాదు. పసిపిల్లలకు ఏడుపు బలం అంటే.. వాళ్లు ఏడుపు అందుకోగానే.. పెద్దలు అలర్ట్ అవుతారు. వెంటనే వారి వద్దకు వచ్చి.. వారికి కావల్సింది ఏమిటో చూస్తారు. అందువల్ల వారికి ఏడుపు బలం!
మూర్ఖుడికి మౌనం బలం. మాట్లాడకుండా ఉన్నంత వరకు వాడి మూర్ఖత్వం బయటపడదు. ఇబ్బంది లేదు. దొంగకు అబద్ధమే బలం.. తప్పించుకోడానికి వాడికి అదొక్కటే దారి. మనం కూడా అబద్ధం చెబుతున్నాం అంటే.. దొంగపని చేస్తున్నామనే అర్థం.
ఈ నాలుగింటిలోనూ ‘బాలానాం రోదనం బలం’ అనే సూత్రం- మనం జీవన శైలికి అలవాటు చేసుకోదగినది. పసివాడి ఏడుపు లాగా చేయడం అంటే.. జీవితంలో మనకు కష్టం వచ్చినప్పుడు మనకంటె పెద్దవాళ్లకి చెప్పుకోవడమే. ఆ కష్టాన్ని దాచుకుని కుమిలితే పరిష్కారం దొరకదు. ఆ కష్టాన్ని చెప్పుకుంటే.. ఎంతో కొంత ఊరట లభిస్తుంది. దాచుకునే కొద్దీ కష్టం, బాధ పెరుగుతుందే తప్ప తరగదు. మనం బాలానాం రోదనం బలం అనే వాక్యాన్ని ఎంతో సరదాగా వ్యాఖ్యానిస్తుంటాం గానీ.. ఇంతటి లోతైన అంతరార్థం ఉంది అందులో.
శుభోదయం
ఇవి కూడా చదవండి :
satire : అర్ధరాత్రి గునపం దరువులు
ప్రజల్లో లోపమే.. ఇష్టారీతిగా ధరల పెంపుదలకు కారణమా?
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
.

Discussion about this post