నలుగురిలో మన ప్రతిభకు గుర్తింపు దక్కాలని కోరుకోవడం చాలా సహజం. నలుగురూ గుర్తిస్తేనే ఎవ్వరి ప్రతిభకైనా రాణింపు అని కూడా అందరూ అనుకుంటూ ఉంటారు.. అలాగే సత్కారాలు అనేవి ప్రతిభకు దక్కే మన్నన! ఎవ్వరైనా సరే ఈ సిద్ధాంతాన్ని ఒప్పుకుని తీరాల్సిందే. అయితే ఈ గుర్తింపు, సత్కారం దక్కకపోతే ప్రతిభ లేనట్లేనా? అలా అని డీలా పడిపోవాల్సిందేనా?
ప్రతిభ గుర్తింపు కోరుకోవడం సహజం. అయితే గుర్తింపు అనేది ప్రతిభకు పరమోన్నత లక్ష్యం. అలాగని గుర్తించకపోయినంత మాత్రాన ప్రతిభ మరుగున పడిపోతుందని, మనకు గిట్టని వారిలో ప్రతిభ ఉన్నప్పుడు- గుర్తించకుండా నటించినంత మాత్రాన వారికి రాణింపు దక్కదులెమ్మని అనుకోవడం మాత్రం భ్రమ.
‘హీరా హైతో చమకేగీ’ అని హిందీలో ఒక సామెత. అది వజ్రమే అయితే ఖచ్చితంగా మెరిసి తీరుతుంది. దాన్ని మీరు బురదలో పడేసినా సరే, దాచి పెట్టినా సరే.. మట్టిలో కూరుకుపోయి ఉన్నా సరే.. అది వజ్రం అయితే.. ఏదో ఒక సందర్భంలో మెరిసి తీరుతుంది!
ప్రతిభ ఉన్నవాళ్లు తమలో కాన్ఫిడెన్స్ సడలకుండా తమను తాము ఉత్తేజపరుచుకోవడానికి చెప్పుకోవాల్సిన మాట ఇది. ఒకరు గుర్తిస్తే మనం రాణిస్తాం అనుకోవడం ఎన్నటికీ కరెక్టు కాదు. వ్యక్తుల్లోని ప్రతిభ దాని సహజ ప్రకాశాన్ని కలిగి ఉంటుంది. ఎవ్వరూ గుర్తించకపోయినా సరే.. ఆ వెలుగులు ప్రసరిస్తూనే ఉంటాయి.
ఇదే విషయాన్ని ఓ సంస్కృత సుభాషితం కూడా చెబుతుంది..
నాభిషేకో న సంస్కారః సింహస్య క్రియతే వనే
విక్రమార్జిత సత్వస్య స్వయమేవ మృగేంద్రతా
సింహం అడవికి రాజు అని పరిగణించడానికి.. ప్రత్యేకంగా పట్టాభిషేకం గానీ.. సంస్కారాలు, క్రతువులు గానీ అవసరం ఉండదు. దాని సహజాతమైన లక్షణాల ద్వారానే.. అది రాజుగా ఆవిర్భవిస్తుంది… అంటుంది సుభాషితం!
సింహం అడవికి రాజు అని ఎవరు చెప్పారు మనకి? మిగిలిన జంతువులకు ఎవరు చెప్పారు? అసలు మిగిలిన జంతువులన్నీ దానిని రాజుగా ఎలా పరిగణిస్తున్నాయి. నిజానికి వాటిలో ఆ తారతమ్యం లేదు. అవి సింహాన్ని రాజుగా అనుకోవు. దేనికది స్వతంత్ర జీవిగానే భావిస్తాయి.
ఒక సందర్భంలో ఒక జంతువు సింహాన్ని చూసి పారిపోతే.. మరొక సందర్భంలో మరొక జంతువు సింహాన్నే తరిమికొట్టవచ్చు. అయితే సింహాన్ని రాజుగా పరిగణించేది మనం. అవసరం ఉన్నా లేకపోయినా ఎదుటివారిని ‘జడ్జ్’ చేసే స్వభావం ఉన్న మనుషులం గనుకనే మనం దాన్ని అలా పరిగణిస్తాం. అయితే మనకు మాత్రం సింహమే అడవికి రాజు అని ఎవరు చెప్పారు?
ఇవి కూడా చదవండి :
Movie Review : తప్పక చూడదగిన చిత్రం క్రిష్-వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’
జనంమెచ్చిన సీఎం.. ఆడు మగాడ్రా బుజ్జీ
పవర్ స్టార్ పవన్ = గ్యాంగ్‌స్టర్ నయీమ్.. ఎలాగో తెలుసా?
అభిమానులు ఊహించని స్టెప్ వేసిన జనసేనాని
దాని సహజమైన పరాక్రమం గమనించి.. మనం ఆ విధంగా భావిస్తుంటాం. సింహం రాజు అనడానికి మరొక తార్కాణం అక్కర్లేదు. దాని సహజ లక్షణం చాలు. మనుషుల్లో కూడా అంతే. మన సహజమైన ప్రతిభలకు మరొకరి గుర్తింపు అక్కర్లేదు. అవి ఖచ్చితంగా రాణిస్తాయి.
ఇవి కూడా చదవండి :
హవ్వ.. రాజగురువు చెప్పినట్టే టీటీడీ ఆడుతోందా?
ప్రజల్లో లోపమే.. ఇష్టారీతిగా ధరల పెంపుదలకు కారణమా?
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
ఒకరు గుర్తించలేదని ఖిన్నులై కూర్చుండిపోవడం తగదు. కర్తవ్య విముఖులు కావడం తగదు. ఎప్పటికైనా సరే.. మన ప్రతిభలే మనకు ప్రేరణ. మన అంతఃచైతన్యమే నిత్య చోదక శక్తి.
శుభోదయం
.

Discussion about this post