చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఈ నెల 22వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4గంటల వరకు ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ డిప్యూటీ ఈవో ఎన్ ఆర్ కృష్ణారెడ్డి తెలిపారు.
ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
దేవస్థానం కు సంబంధించిన సూచనలు, సలహాలు భక్తులు నేరుగా 08578-222240 ఫోన్ నంబరుకు తెలియ చేయాలని ఆయన కోరారు.
ఈ అవకాశాన్ని ముక్కంటి భక్తులు వినియోగించుకోవాలని కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. దేవదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆయన తెలిపారు.
ఇకపై ప్రతి నెల రెండు పర్యాయాలు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ముక్కంటి ఆలయ చరిత్రలో మొట్ట మొదటి సారిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం భక్తులు వినియోగించుకోవాల్సి ఉంది.
.