తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తేవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ నేతలు కోరుకున్నారు.
తెలుగుయువత రాష్ట్ర షోషల్ మీడియా కోఆర్డినేటర్ గా నియమించబడిన కేవీ ప్రతాప్.. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి గా నియమించబడిన జిలానీ బాషాను శనివారం ఆ పార్టీ నేతలు సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీడీపీతోనే రాష్ట్రాభి వృద్ధి సాధ్యమవుతుందన్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డిని ఎమ్మెల్యేగా.. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపించడానికి ఇప్పటి నుంచే ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.
ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ తెలుగుమహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష, మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ మిన్నల్ రవి, నెమళ్లూరు బుజ్జి, రాఘవులు, గోపి, కృష్ణమనాయుడు, ఆర్ముగం, బాలాజీ, లోకేష్, పార్ధు, మునిరజా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
.