కరోనా కష్టకాలం లో నాయి బ్రాహ్మణులకి చేసిన సేవలకు గాను శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన నాయి బ్రాహ్మణుల సంక్షేమ సంఘము జిల్లా అధ్యక్షుడు కోట చంద్ర శేఖర్ కి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డును అందచేశారు.
హైదరాబాద్ కు చెందిన విశ్వ గురు వరల్డ్ రికార్డ్స్ ఎండీ సత్యవోలు రాంబాబు, చంద్ర శేఖర్ చేసిన సేవలను గుర్తించి ఈ సేవలకు గాను అవార్డుని ఆన్ లైన్ ద్వారా ఆయనకి పంపించారు.
గత రెండేళ్లలో నాయి బ్రాహ్మణులకి రుణాల మంజూరు కరోనా సమయంలో ఎంఎల్ఏ బియ్యపు మధుసూదన్ రెడ్డి సహకారంతో నాయీబ్రాహ్మణులకు పీపీఈ కిట్లు, నిత్యావసర సరుకులు తదితరాలు అందచేశారు.
నాయి బ్రాహ్మణుల సంక్షేమం పైన పలు పోరాటాలు చేసిన ఫలితంగా ఈ అవార్డు ని అందచేసినట్టు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఎండి తెలియచేసారు.
ఈ సందర్భంగా కోట చంద్రశేఖర్ ని పలువురు అభినందించారు.
.