తెలుగు సాహిత్యానికి, భాషాభివృద్దికి గురజాడ అప్పారావు కృషి చిరస్మరణీయమని అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జిల్లా ప్రధాన కార్యదర్శి యువశ్రీ మురళి అన్నారు.
మంగళవారం గురజాడ అప్పారావు వర్థంతి సందర్భంగా స్థానిక కల్లివెట్టు ఉన్నత పాఠశాలలో చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పుష్పాంజలి అర్పించారు.
ఈ సందర్భంగా యువశ్రీ మురళి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ఆధునిక తెలుగు సాహిత్యంలో తనదైన చెరగని ముద్రవేశారని అన్నారు.
సామాజిక సంఘటనలే కథావస్తువుగా కన్యాశుల్కం అందించిన సంఘసంస్కర్త తెలుగు సాహిత్యానికి అడుగుజాడ గురజాడ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేష్ బాబు, ఒబ్బు దేవి ప్రసాద్, నాదెండ్ల మురళి, వేణుగోపాల్, మోహన్ బాబు, దాసు, విద్యార్థులు పాల్గొన్నారు.
.