వరదలు లాంటి విపత్తులు సంభవించినపుడు వెంటనే స్పందించి నష్టాన్ని నివారించేందుకు వీలుగా టిటిడిలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. రెండో ఘాట్ రోడ్డులో జరుగుతున్న మరమ్మతు పనులను జనవరి 10వ తేదీలోపు పూర్తి చేసి భక్తుల వాహనాలను అనుమతించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఘాట్ రోడ్డు పనులను సోమవారం నాడు ప్రత్యక్షంగా పరిశీలించి ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం వరదలు లాంటి విపత్తులు సంభవించినపుడు ఎలా స్పందించాలి అనే అంశంపై టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి ఆదేశాల మేరకు తిరుమలలోని తన కార్యాలయంలో అదనపు ఈవో సమీక్ష నిర్వహించారు.
జిల్లాస్థాయిలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్‌లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలని, విపత్తులు వాటిల్లినపుడు చేపట్టాల్సిన చర్యలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపి) తయారు చేయాలని సూచించారు. ఈ టీమ్ ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ నివేదికలను పరిశీలిస్తూ టిటిడి యాజమాన్యానికి తెలియజేయాలని, అటవీ, ఆరోగ్య, ఇంజినీరింగ్, నిఘా మరియు భద్రత తదితర విభాగాలను అప్రమత్తం చేయాలని కోరారు.
ఈ టీమ్ 15 రోజుల్లోపు మార్గదర్శకాలను సిద్ధం చేయాలని, విభాగాల వారీగా చేపట్టాల్సిన బాధ్యతలను రూపొందించాలని సూచించారు.
ఆ తరువాత ప్లాస్టిక్ నిషేధంపై అదనపు ఈవో సమీక్షిస్తూ దశలవారీగా ప్లాస్టిక్ క్యారీబ్యాగులు, ప్యాకింగ్ మెటీరియల్, బొమ్మలను తిరుమలకు దూరం చేయాలన్నారు. ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు స్థానిక వ్యాపారులతో ఒక సమావేశం నిర్వహించాలని కోరారు.
ఈ సమీక్షలో జెఈవో సదా భార్గవి(వర్చువల్‌గా), జెఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post