విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించడమే సమగ్ర శిక్ష ప్రధాన లక్ష్యమని సమగ్ర శిక్ష జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి శివశంకరయ్య అన్నారు.
మండల వనరుల కేంద్రంలో బుధవారం సీఆర్పీలు, ఇతర సిబ్బంది తో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష అమలు చేస్తున్న కార్యక్రమాలు పాఠశాలల్లో వంద శాతం అమలయ్యేలా సిఆర్పీలు పర్యవేక్షించాలన్నారు.
ఎఫ్ ఎల్ ఎన్, దీక్ష, ఈ కంటెంట్ తదితర కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పూర్వ విద్యార్థులు, స్థానికులైన దాతల నుంచి పాఠశాలల అభివృద్ధికి విరాళాలు సేకరించి సంబంధిత ఫోర్టల్ లో వివరాలు నమోదు చేసేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని చెప్పారు.
కార్యక్రమంలో ఎంఈవో భువనేశ్వరి., సీఆర్పీలు మునిమోహన్, ప్రదీప్, ప్రసాద్, గాంధీ, కృష్ణయ్య, ధనశంకరయ్య, స్వప్న., సునీత, దేవిప్రియ.,లలిత, ఎంఆర్సీ సిబ్బంది మాధవయ్య., లలిత పాల్గొన్నారు.
.