1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆవిర్భవించి 71 సంవత్సరాల పూర్తైన సందర్భంగా.. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నగరి నందు 72వ రాజ్యంగ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడం జరుగింది.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. ఆర్ వేణగోపాల్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్దదని,మహోన్నతమైనదని కొనియాడుతూ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు, బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని హితువు పలికారు.
ప్రపంచంలోని వివిధ రాజ్యాంగాలను అధ్యయనం చేసి… సర్పంచ్ నుంచి ప్రధాని వరకు, సాధారణ పౌరుని నుంచి రాష్ట్రపతి వరకు వారి వారి హక్కులు, అధికారాలు, బాధ్యతలు వివరించే కరదీపిక లాంటిది మన రాజ్యాంగం అని రాజనీతి శాస్త్ర అధ్యాపకులు డా. సి. రమణారెడ్డి, డా. ఈ. గోపి అన్నారు.
NSS అధికారి డా. యం. ధర్మారావు, జి సరిత, రామానుజులు, గంగాధరం, భాషా తదితర అధ్యాపకులు విద్యార్ధినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
.