గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం శ్రీనివాసపురం పంచాయతీ కార్మికులు సమ్మెకు దిగారు.
ఈ సందర్భంగా జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి పి ఎల్ నర్సింహులు మాట్లాడుతూ కార్మికులకు .ఈఎస్ఐ. పీఎఫ్ సౌకర్యం కల్పించాలని గతంలో అధికారులు. ప్రస్తుత సర్పంచ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని శ్రీనివాసపురం పంచాయతీ కార్మికులు సమ్మెకు దిగడం చాలా న్యాయ బద్ధమైనదని అన్నారు.
కార్మికుల వద్దనుండి వసూలు చేసిన. ఈఎస్ఐ. పీఎఫ్ డబ్బులను ఈఎస్ఐ పీఎఫ్ సంస్థలకు చెల్లించకుండా వాడుకోవడం చాలా దుర్మార్గం అన్నారు.
అందువల్ల పంచాయతీ లో పనిచేస్తున్న కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం లేని కారణంగా. కరోనా కష్టకాలంలో అనేక ఇబ్బందులు పడి. అనారోగ్యం పాలై ప్రైవేటు హాస్పిటల్ వైద్యంతో అప్పుల పాలయ్యారన్నారు. పంచాయతీ ని విభజన చేసిన తర్వాత కార్మికులను విభజన చేశారు. కార్మికుల హక్కులు .కార్మికుల కు రావలసిన బకాయిలు చెల్లించాల్సిన వేతనాలు కొత్త పంచాయతీకి కేటాయించడంలో అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.
అందువల్ల. కార్మికుల సమస్యలపై జాయింట్ కలెక్టర్ ను DPO. DLPO.. పంచాయతీ కార్యదర్శి ని అనేక సందర్భాల్లో కలిసి చర్చించడం జరిగిందని .కలిసిన ప్రతి సందర్భంలో కూడా హామీలు ఇచ్చిన అధికారులు.. అమలు లో మాత్రం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదని. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ రోజు సమ్మెకు దిగాల్సి వచ్చిందని చెప్పారు.
వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్దఎత్తున అందరినీ కలుపుకొని పోరాటాన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు .
ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి విశ్వనాథం. చంద్రగిరి నియోజకవర్గ AITUC ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి. ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎన్ డి రవి. నాగరాణి .గోవింద స్వామి.శ్రీనివాసులు. పద్మనాభరెడ్డి. స్థానిక పద్మావతి పురం పంచాయతీ కార్మికులు. ఏడుకొండలు. ప్రభాకర్. సుబ్బులయ్య. వెంకటరమణ. పద్మావతి పురం గ్రామ పంచాయతీ కార్మికులు సుధాకర్ మోహన్ మరియు గ్రామ పంచాయతీ వర్కర్స్ మద్దతుగా పాల్గొన్నారు
.