ఎన్నికల్లో అంతిమ విజయం సాధించడం మాత్రమే కాదు. ఆ క్రమంలో ఎదురుపడగల ఇబ్బందులను తొలగించుకోవడం కూడా ఒక విజయమే. ఆ ప్రకారం చూసినప్పుడు.. మా ఎన్నికలలో తన సత్తా చాటాలని చూస్తున్న ప్రకాష్ రాజ్.. తొలివిజయం నమోదు చేశారు.
మంచు విష్ణు ప్యానెల్ తో ప్రకాష్ రాజ్ ప్రధానంగా పోటీపడుతున్న సంగతి తెలిసిందే. అయితే.. పోటీ దారులు ఎక్కువైతే సహజంగానే ఓట్లు చీలుతాయి. విష్ణు వ్యతిరేక గ్రూపుగా ముద్రపడిన వారు విడివిడిగా పోటీచేస్తే అది విష్ణుకే ఎడ్వాంటేజీ అవుతుంది. ఆ ఆలోచనతే.. ప్రకాష్ రాజ్ ప్రధాన కార్యదర్శి పదవికి బరిలోకి దిగిన బండ్ల గణేశ్ తో మంతనాలు సాగించి, ఆయనను ఉపసంహరింపజేశారు.
బండ్ల గణేశ్ తొలుత ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచే బరిలో ఉంటారని ప్రకటించారు. ఆతర్వాతి పరిణామాల నేపథ్యంలో.. ప్రకాష్ రాజ్ గ్రూపులోకి జీవిత ప్రవేశించిన తరువాత.. ఆ నిర్ణయంతో అలిగిన బండ్ల గణేశ్ బయటకు వెళ్లారు. ప్రకాశ్ రాజ్ మీద కూడా పలు విమర్శలు చేశారు.
బండ్ల గణేశ్ విడిగా.. స్వతంత్ర అభ్యర్థిగా ప్రధాన కార్యదర్శి పదవికి పోటీచేస్తున్నట్టు గణేశ్ ప్రకటించారు. జీవితను ఓడించేందుకే ప్రధాన కార్యదర్శిగా బరిలోకి దిగినట్టు కూడా ఆయన ప్రకటించారు.
ఈ పోటీతో మొదటికే మోసం వస్తుందని గ్రహించిన ప్రకాష్ రాజ్.. గణేశ్ తో మంతనాలు సాగించి ఎట్టకేలకు ఒప్పించారు. ‘‘నా దైవ సమానులు, నా ఆత్మీయులు, నా శ్రేయోభిలాషుల సూచన మేరకు జనరల్ సెక్రటరీ నామినేషన్ ను వెనక్కి తీసుకుంటున్నా’’ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ లతో కలిసి దిగిన ఫోటోను కూడా, విత్ డ్రా చేసుకుంటున్న లేఖ ప్రతిని కూడా పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి :
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
రోజా సీటు కింద పెద్దిరెడ్డి కుంపటి రాజేస్తున్నారా
మన విలువను వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవడం అవసరం
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
పవన్ కల్యాణ్ పై పోసాని ఆగ్రహం న్యాయమే
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
పవన్ కల్యాణ్ ఒంటరి అయిపోయాడా?
అవినీతి కేసుల్లో ఉన్న ఐఏఎస్ శ్రీలక్ష్మి .. తర్వాత ఎపీ సీఎస్ అవుతారా?
సో, ప్రత్యర్థి వ్యతిరేక ఓటు చీలిపోకుండా.. ఒక పోటీదారును తగ్గించడం ద్వారా ప్రకాష్ రాజ్ తొలివిజయం నమోదు చేసినట్టు అయింది.
నా దైవ సమానులు నా ఆత్మీయులు నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను.🙏
బండ్ల గణేష్ pic.twitter.com/ivupXDqChl
— Telugu Film Producers Council (@tfpcin) October 1, 2021
.